Chaitanya Master : ఢీ షో కొరియోగ్రాఫర్ చైతన్య సూసైడ్ పై లైవ్ లో కొరియోగ్రాఫర్ సురేష్ వర్మ ఎమోషనల్..!!

Authored By Prahbas Gilakathula | The Telugu News | Published on: May 3, 2023, 9:00 am

Chaitanya Master : ఢీ షో కొరియోగ్రాఫర్ చైతన్య ఆత్మహత్య కలకలం సృష్టించింది. తిరుగులేని క్రేజ్.. ఎక్కడికి వెళ్ళినా గుర్తింపు ఉన్న గాని… ఆర్థిక ఇబ్బందులతో.. అప్పుల బాధ తట్టుకోలేక మరణించడం అందరిని కలిచివేసింది. పైగా మల్లెమాల వంటి అతిపెద్ద సంస్థ వద్ద పనిచేసే సెలబ్రిటీ ఈ రీతిగా చనిపోతున్నట్లు.. వీడియో తీసి అందరికీ తెలియజేస్తూ.. సూసైడ్ చేసుకోవడం.. మిగతా ఆర్టిస్టులకు ఎంతగానో బాధ కలిగించింది.

అయితే ఈ ఘటనపై డాన్స్ మాస్టర్ సురేష్ వర్మ లైవ్ లో ఎమోషనల్ అయ్యారు.చైతన్య తన వద్ద పనిచేయడం జరిగిందని చెప్పుకొచ్చారు. తాను ఎప్పుడూ కూడా చాలా సైలెంట్ గా ఉండే వ్యక్తి. తన ప్రొఫెషన్ నీ బాగా ఇష్టపడే.. చాలా ఉన్నతమైన స్థానంలోకి రావడం జరిగింది. అటువంటి వ్యక్తి అప్పుల బాధతో చనిపోవడం నిజంగా బాధాకరం. అయితే ఏదైనా ప్రాబ్లం ఉన్నప్పుడు పక్క వాళ్ళతో షేర్ చేసుకోవడం అనేది అలవాటు చేసుకోవాలి.

Dance Master Suresh Varma About Dhee Chaitanya Master

Dance Master Suresh Varma About Dhee Chaitanya Master

వీళ్ళకి పేరు వచ్చింది అంటే ఈటీవీ మరియు మల్లెమాల కారణం. మనకి ఏదైనా ఆర్థిక ఇబ్బందులు వచ్చాయి అంటే వాళ్లకి తెలియజేయాలి. పనిచేసే వాళ్ళ దగ్గర చెప్పుకోవడంలో తప్పేం లేదు. అప్పుడు వాళ్ళు ఏదైనా చేస్తే.. సమస్య పరిష్కారం అవ్వచ్చు. ఒకవేళ చేయకపోతే ఈ విధంగా వాయిస్ రైజ్ చేయవచ్చు. ఏది ఏమైనా సమస్య వస్తే షేర్ చేసి అందరూ కలిసికట్టుగా ఉండాలి.. అంటూ సురేష్ మాస్టర్ తెలియజేయడం జరిగింది.

Prahbas Gilakathula

Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp