Chaitanya Master : చైతన్య మాస్టర్ చనిపోయే ముందు వాళ్లకి ఫోన్ చేసి ఏం మాట్లాడాడో వినండి.. వీడియో

Authored By Breaking News 2 | The Telugu News | Published on: May 2, 2023, 5:00 pm

Chaitanya Master : ఢీ షోలో పాపులర్ అయిన చైతన్య మాస్టర్ చాలా సెన్సిటివ్ పర్సన్. చాలా సున్నితంగా ఉంటాడు. అందరితో చాలా నెమ్మదిగా వ్యవహరిస్తుంటాడు. అందరినీ ఫ్రెండ్లీగా పలకరిస్తుంటాడు. డౌన్ టు ఎర్త్ ఉంటాడు. చాలామంది అదే చెబుతారు. అయినా కూడా చైతన్య ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకున్నారు అనేది అంతుచిక్కడం లేదు. చైతన్య ఇంత చిన్న విషయానికి సూసైడ్ చేసుకునేవారు కదా అంటూ బాధపడుతున్నారు.

கழுத்தை நெரிந்த கடன்..! பிரபல நடன இயக்குனர் தூக்கிட்டு தற்கொலை..!

అయితే.. చైతన్య చనిపోవడానికి ముందు చివరగా ఫోన్ లో మాట్లాడిన ఓ ఆడియో కాల్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. విశాఖకు చెందిన ఓ డ్యాన్స్ మాస్టర్ తో మాట్లాడిన ఆడియో కాల్ అది. ఎలాగైనా నేను మీకే చేస్తాను సార్ అని అంటాడు. ఆ తర్వాత ఇంకా ఎవరైనా ఉన్నారా పుష్ప ఇంకా ఎవరు ఉన్నారు అని అడుగుతాడు డ్యాన్స్ మాస్టర్. దీంతో రంజిత్ ఉన్నాడు సార్ అంటాడు. అరుణ్ ఉన్నారా అంటే అరుణ్ కాదు సార్ తరుణ్ అంటాడు.

Dhee Choreographer Chaitanya Master Last Audio Call

Dhee Choreographer Chaitanya Master Last Audio Call

Chaitanya Master : తరుణ్ వద్దు అన్న డ్యాన్స్ మాస్టర్

అయితే.. తరుణ్ వద్దు అని అంటాడు డ్యాన్స్ మాస్టర్. రాహుల్ ఉన్నాడా అంటే.. లావుగా ఉంటాడు ఉన్నాడు కానీ.. 20 వేలకు తగ్గడు సార్ అంటాడు. 20లో ట్రావెల్ అంతా సెట్ చేస్తా సార్ అంటాడు. ఇంకా ఎవరైనా ఉంటే చూడు. ఏదో ఈవెంట్ కు కావాలి అని చైతన్య మాస్టర్ తో విశాఖకు చెందిన వెంకట్ అనే డ్యాన్స్ మాస్టర్ డ్యాన్సర్లు ఉంటే చూడమని చెప్పి ఉంటాడు. దానికి సంబంధించిన ఫోన్ కాల్ అది. కానీ.. అదే చైతన్య మాస్టర్ మాట్లాడిన చివరి ఫోన్ కాల్. ఆ ఫోన్ కాల్ తర్వాత చైతన్య మాస్టర్ నెల్లూరులోని హోటల్ లో సూసైడ్ చేసుకున్నాడు. దీంతో తెలుగు బుల్లితెర ఇండస్ట్రీ ఒక్కసారిగా మూగబోయింది. ముఖ్యంగా ఢీ షో కంటెస్టెంట్లు అయితే చైతన్య మాస్టర్ మరణాన్ని తట్టుకోలేకపోతున్నారు. బోరున విలపిస్తున్నారు.

Breaking News 2

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp