Dancer Pandu : అమ్మలా చూసుకుంటానని చెప్పి వెళ్లిపోయింది.. ప్రియురాలిని తల్చుకుని ఏడ్చేసిన పండు

Authored By mallesh | The Telugu News | Published on: September 29, 2022, 8:30 pm

Dancer Pandu : పండుగల సీజన్ వచ్చిందంటే చాలు బుల్లితెరపై స్పెషల్ ఈవెంట్స్ ప్లాన్ చేస్తుంటారు. అందుకోసం కమెడియన్స్, కంటెస్టెంట్స్ కు రెమ్యూనరేషన్ కూడా బాగానే ప్లాన్ చేస్తారు.ఇక ఇటువంటి స్పెషల్ షోస్, ఈవెంట్స్ నిర్వహించడంలో ఈటీవీ తర్వాతే ఎవరైనా అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనోడి దగ్గర అంత స్టఫ్ ఉంటుంది. కమెడియన్లతో స్పెషల్ అకేషన్ రచ్చ రచ్చ చేయిస్తాడు.

Dancer Pandu : పండు ఇలా ఏడ్చేశాడేంటి..

ఈటీవీ యాజమాన్యం ఏ పండుగలను వదలదు. ఉగాది,వినాయకచవితి, రక్షాబందన్, ఇపుడు దసరా, త్వరలో దీపావళి ఇలా అన్ని పండుగలకు స్పెషల్ ఈవెంట్స్ ప్లాన్ చేస్తుంటుంది. ఇందులో ఢీ షో నుంచి డ్యాన్సర్స్, జబర్దస్త్ నుంచి కమెడియన్స్, జడ్జిలు, స్పెషల్ గెస్టులు, యాంకర్స్ ఇలా అందరూ పాలు పంచుకుంటుంటారు. ఇక ఇందులో డ్యాన్సులు, పాటలు,ఎమోషన్స్, కామెడీ అన్నింటిని క్యారీ అయ్యేలా చూస్తారు. మల్లెమాల వారు జబర్దస్త్ కమెడియన్స్ తో స్పెషల్ స్కిట్స్ ప్లాన్ చేస్తారు. ఇవి రోటిన్ కంటే భిన్నంగా ఉండేలా చూస్తారు. ఇక ఎవరో ఒకరు పండుగ అకేషన్‌లో స్పెషల్ ఎమోషన్ క్యారీ అయ్యేలా కూడా చూస్తారు.

Dancer Pandu Cried While Telling About Her Lover

Dancer Pandu Cried While Telling About Her Lover

దీనికి సంబంధించిన సీన్స్ తీసి ప్రత్యేకంగా ఒక ప్రోమో కట్ చేస్తారు. అందులో కామెడీ, ఎంటర్ టైన్మెంట్ , ఎమోషన్స్ చక్కగా చూపిస్తారు. తాజాగా దసరా పండుగ నేపథ్యంలో శ్రీదేవి డ్రామా కంపెనీ ‘మంగమ్మ గారి కొడుకు’ ఎపిసోడ్‌కు సంబంధించి ప్రోమోను రిలీజ్ చేసింది.దీనిలో డ్యాన్సర్ పండు తన ప్రియురాలిని తలచుకుని ఎమోషనల్ అయ్యాడు.‘ఊహ తెలియని వయసులో అమ్మ చనిపోయింది.ఆ తర్వాత తనకు నచ్చిన అమ్మాయిని ప్రేమించాను.అమ్మలా తోడుంటానని చెప్పి ప్రామిస్ చేసింది. తను కూడా మా అమ్మ దగ్గరకే వెళ్ళిపోయింది’.. అంటూ పండు వెక్కి వెక్కి ఏడ్చేశాడు. ప్రస్తుతం ఈ ప్రోమో నెట్టింట తెగ వైరల్ అవుతోంది.

mallesh

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp