Thaggedele: రొమాన్స్‌తో రెచ్చిపోయిన పండు.. స్టేజ్ మీదే ఆ పని చేయడంతో షాక్

Authored By Cinema Desk | The Telugu News | Updated on: October 30, 2021, 7:41 pm

ఢీ షోతో మంచి క్రేజ్ తెచ్చుకున్నాడు డ్యాన్సర్ పండు. డ్యానర్స్‌గానే కాకుండా డ్యాన్ మాస్టర్‌గా కూడా పండు మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. ముఖ్యంగా నెక్లెస్ గొలుసు సాంగ్‌తో పండు పాపులారిటీ డబుల్ అయింది. యూట్యూబ్‌లో ఆ వీడియోను 100 మిలియన్లకు పైగా వ్యూస్ వచ్చాయి. అంతేకాకుండా కామెడీతో కూడా పండు జనాలను అలరిస్తున్నాడు. యూట్యూబ్ వెబ్ సిరీస్‌లలో సందడి చేస్తున్నారు. అయితే పండు చేసే కొన్ని డ్యాన్స్ ఫర్ఫామెన్సెస్ మాత్రం అలా గుర్తిండిపోతాయని అంటున్నారు అతడి ఫాలోవర్స్.

dancer pandu romantic performance with teju in thaggede le event

dancer pandu romantic performance with teju in thaggede le event

అయితే తాజాగా దీపావళి ఈవెంట్‌లో పండు చేసిన ఫర్ఫామెన్స్‌ మైండ్ బ్లోయింగ్ అనే విధంగా ఉంది. ఉప్పెన చిత్రంలోని సముద్రమంతా ప్రేమ సాంగ్‌కు.. పండు స్టేజిపై రొమాంటిక్‌ డ్యాన్స్‌తో అదరగొట్టాడు. రెయిన్ ఎఫెక్ట్‌తో డ్యాన్సర్ తేజ్‌తో పండు అదరగొట్టాడు. ఇద్దరి మధ్య కెమిస్ట్రీ కూడా అదిరిపోయింది. వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ చూసిన వారంతా అలా చూస్తూ ఉండిపోయారు.

పండుకు ముద్దు పెట్టడంతో అంతా షాక్

ఇదిలా ఫర్పామెన్స్‌లో భాగంగా తేజు.. పండును కిస్ చేయడంతో అంతా షాక్ అయ్యారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించి ప్రోమో వైరల్‌ అవుతుంది. ప్రోమోనే ఇలా ఉంటే అసలు ఫర్పామెన్స్ ఏ రేంజ్‌లో ఉంటుందో అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. గతంలో కూడా పండు ఇలాంటి రొమాంటిక్ డ్యాన్స్‌తో అభిమానులను అలరించిన సంగతి తెలిసిందే. అసలే పండు పెళ్లి కావాలనే తొందరపడుతున్నాడు. ఆ కసి మొత్తం కూడా ఇందులో కనిపించినట్టుంది.

https://www.youtube.com/watch?v=0uIvHaXam30

Cinema Desk

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp