Deepika Pilli : ప్రేమలో పడిపోయా!.. గాల్లో తేలిపోతోన్న దీపిక పిల్లి
Deepika Pilli : దీపిక పిల్లి ఈ మధ్య డోస్ పెంచుతోంది. మామూలుగా ఉంటే కుదరడం లేదని, ఘాటుగా మారిపోయింది. నాటు స్టెప్పులు వేస్తోంది. హీటు పెంచేస్తోంది. పొట్టి బట్టల్లో అందరినీ ఫిదా చేస్తోంది. స్టేజ్ మీదే మంటలు పుట్టించేలా హాట్ డ్యాన్సులు చేస్తోంది. దీపిక పిల్లి తనలోని ఇంకో కోణాన్ని బయటపెట్టేస్తోంది. మొత్తానికి త్వరలోనే దీపిక పిల్లి బుల్లితెర, వెండితెరపై స్టార్‌గా మారబోతోందనే సంకేతాలు వినిపిస్తున్నాయి. కామెడీ స్టార్స్ షోలో సోలో యాంకర్‌గా రాణించేస్తోంది. మరో వైపు వెండితెరపై దుమ్ములేపేందుకు రెడీ అవుతోంది.
దర్శకేంద్రుడు కే రాఘవేంద్రరావు పర్యవేక్షణలో శ్రీధర్ సీపాణ తెరకెక్కించిన వాంటెడ్ పండు గాడ్ అనే సినిమాలో దీపిక పిల్లి ఓ హీరోయిన్‌గా నటించింది. అయితే ఈ చిత్రంతో దీపిక పిల్లి స్టార్ అవుతుందని, ఎంతో అందంగా ఉందని, ఎన్నో అవకాశాలు వస్తాయని స్వయాన దర్శకేంద్రుడే చెప్పేశాడు. అలా దీపిక పిల్లి త్వరలోనే సిల్వర్ స్క్రీన్ మీద తన అందాలను ప్రదర్శించి అందరినీ ఫిదా చేయబోతోందన్న మాట. ఈ చిత్ర ట్రైలర్‌ను ఈ మధ్యే విడుదల చేయగా.. మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ ఈవెంట్‌లో చిత్రయూనిట్ అంతా కూడా పాల్గొంది. మొత్తానికి దీపిక పిల్లి, సుధీర్, విష్ణుప్రియ వంటి బుల్లితెర తారలు నటిస్తోన్న ఈ సినిమా మీద మెల్లిగా అంచనాలు పెరుగుతున్నాయి.

Deepika Pilli Enjoys Nature video
అయితే ఇప్పుడు మాత్రం దీపిక పిల్లి నేచర్‌ను ఎంజాయ్ చేస్తోన్నట్టు కనిపిస్తోంది. కాఫీ తోటల్లో విహరిస్తోన్నట్టుంది. ఈ వర్షాన్ని, చుట్టూ కొండలు, కోనలు, పచ్చదనం చూసి ఆమె ఆ ప్లేస్‌తో ప్రేమలో పడిందట. ఈ విషయాన్ని చెబుతూ.. కురిసింది మేఘం మేఘం అనే పాటకు ఐశ్వర్య రాయ్‌లా స్టెప్పులు వేసింది. మొత్తానికి దీపిక పిల్లి నెట్టింట్లో చేసే రీల్ వీడియోలు అందరినీ ఆకట్టుకుంటూ ఉంటాయి. తాజాగా వర్షంలో ఆమె వేసిన స్టెప్పులు అందరినీ ఫిదా చేసేస్తున్నాయి. మరి దీపిక పిల్లి ఇలా ప్రేమలో పడిపోయాయని చెప్పింది.. మళ్లీ హైద్రాబాద్ ఎప్పుడు వస్తుందో చూడాలి.
View this post on Instagram