Bigg Boss 5 Telugu : అయ్యో.. రెండు జంటలను విడదీశావు కదా బిగ్ బాస్ 5 తెలుగు …

Advertisement

Bigg Boss 5 Telugu : బిగ్ బాస్ 5 తెలుగు సీజన్ ముగిసింది. ఈసారి విజేతగా నిలిచింది వీజే సన్నీ. కానీ.. ప్రస్తుతం వీజే సన్నీ గురించి ఎవ్వరూ మాట్లాడుకోవడం లేదు. కేవలం షణ్ముఖ్ జస్వత్, సిరి గురించే అందరూ మాట్లాడుకుంటున్నారు. విన్నర్ ను వదిలేసి.. రన్నర్ గురించి చర్చిస్తున్నారు అందరూ. ఎందుకు.. కారణం ఏంటి.. అనే విషయాలు తెలియాలంటే ఓసారి మనం బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లాల్సిందే. నిజానికి.. షణ్ముఖ్, సిరి.. ఇద్దరూ బయట బెస్ట్ ఫ్రెండ్స్. అందుకే.. ఇద్దరూ హౌస్ లో కూడా చాలా క్లోజ్ గా ఉన్నారు. 105 రోజులు ఇద్దరే ఎక్కువగా కలిసి ఉన్నారు. బెడ్ మీద కలిసి పడుకోవడం.. హగ్గులు, ముద్దులు.. అంటూ వాళ్లు కొంచెం హద్దులు దాటారు. అదే ఇప్పుడు వాళ్ల రియల్ లైఫ్ కొంప ముంచింది.అయితే.. షణ్ముఖ్ కు ఇదివరకే

Advertisement

లవర్ ఉంది. తను కూడా బిగ్ బాస్ కంటెస్టెంటే. పేరు దీప్తి సునయన. సోషల్ మీడియా స్టార్. తనకు లక్షల్లో ఫాలోవర్స్ ఉన్నారు. అప్పుడే షణ్ముఖ్ తనకు పరిచయం అయ్యాడు. ఇద్దరూ దగ్గరయ్యారు. ఇద్దరూ చాలా ఏళ్ల నుంచి రిలేషన్ షిప్ లో ఉన్నారు.అలాగే.. సిరి కూడా అంతే. యూట్యూబ్ షార్ట్ మూవీస్ లో నటించే శ్రీహాన్ తో పరిచయం ఏర్పడి అది ప్రేమగా మారింది. ఇప్పుడు వాళ్లిద్దరు కూడా రిలేషన్ షిప్ లో ఉన్నారు. అయితే.. బిగ్ బాస్ 5 కి వెళ్లకముందు ఈ రెండు జంటలు హ్యాపీగానే ఉన్నాయి. ఎప్పుడైతే.. సిరి, షణ్ముఖ్ ఇద్దరూ బిగ్ బాస్ హౌస్ కు వెళ్లారో అక్కడే ఏదో తేడా కొట్టింది.ఇప్పుడు సిరికి శ్రీహాన్ బ్రేకప్ చెప్పడం.. దీప్తి.. షన్నుకు బ్రేకప్ చెప్పడం ఒకేసారి జరిగిపోయాయట. ఎందుకంటే.. షో నుంచి బయటికి వచ్చాక..

Advertisement
deepthi breaks up with shanmukh and siri with srihan after bigg boss 5
deepthi breaks up with shanmukh and siri with srihan after bigg boss 5

Bigg Boss 5 Telugu : సిరితో శ్రీహాన్ బ్రేకప్ చెప్పాడా? దీప్తి.. షణ్ముఖ్ కు బ్రేకప్ చెప్పిందా?

దీప్తిని ఒక్కసారి కూడా షన్ను కలవలేదట. దీప్తి కూడా అతడిని కలవడానికి రాలేదట. అంటే.. సిరి విషయంలోనే దీప్తి సీరియస్ అయిందన్నమాట.షో నుంచి బయటికి వచ్చాక షణ్ముఖ్.. తన ఫ్యామిలీ మెంబర్స్ తో పార్టీ చేసుకున్నాడు. ఫోటోలను కూడా సోషల్ మీడియాలో షేర్ చేశాడు. అందులో ఎక్కడ వెతికినా.. దీప్తి మాత్రం కనిపించలేదు. అంత ముఖ్యమైన పార్టీలో దీప్తి మిస్ అవడం ఏంటి? అంటే.. దీప్తి.. సిరి విషయంలో సీరియస్ అయినట్టే కదా. మరోవైపు శ్రీహాన్ కూడా సిరికి దూరంగా ఉంటున్నాడట. తనతో అంటిముట్టనట్టే ఉంటున్నాడట. దీనికి కారణం కూడా బిగ్ బాస్ ఎఫెక్టే అంటున్నారు. అయ్యో.. పచ్చని రెండు జంటల కాపురాల్లో చిచ్చురేపావు కదా బిగ్ బాసూ అంటూ నెటిజన్లు బిగ్ బాస్ పై ఆడిపోసుకుంటున్నారు.

Advertisement
Advertisement