Deepthi Sunaina : దీప్తి సునయన, షన్నూల గురించి వస్తున్న ఆ వార్తలు పూర్తిగా అవాస్తవం
Deepthi Sunaina : యూట్యూబ్ సూపర్ స్టార్ గా షణ్ముఖ్ జస్వంత్, లేడీ సూపర్ స్టార్ గా దీప్తి సునయన పేరు దక్కించుకున్నారు అనడంలో సందేహం లేదు. తెలుగు యూట్యూబర్స్ గా వీరిద్దరికి ఉన్న పేరు అంతా కాదు. వీరిద్దరూ యూత్ లో విపరీతమైన ఫాలోయింగ్ దక్కించుకున్నారు. హీరో హీరోయిన్ రేంజ్ లో వీరిద్దరు కూడా సోషల్ మీడియాలో పాపులారిటీ సొంతం చేసుకున్నారు. అలాంటి వీరిద్దరూ ప్రేమలో మునిగి తేలిన విషయం తెలిసిందే. ఇద్దరు పెళ్లి పీటలు ఎక్కేందుకు రెడీ అయ్యారు. పెళ్లి నిశ్చితార్థం కూడా జరిగిందని వార్తలు వచ్చాయి. కొన్ని రియాల్టీ కార్యక్రమాలకు వీరిద్దరూ జంటగా హాజరై అందరినీ ఆశ్చర్యపరిచారు. పెళ్లికి డేట్ కూడా ఫిక్స్ అయింది అనుకుంటుండగా షణ్ముఖ్ జస్వంత్ బిగ్ బాస్ కి వెళ్లి అక్కడ చేసిన రచ్చ కారణంగా బయటకు వచ్చాక దీప్తి సునయన అతడికి బ్రేకప్ చెప్పేసింది
అంటూ వాళ్ల సన్నిహితులు మరియు స్నేహితులు మాట్లాడుకుంటున్నారు. ఆ విషయం పక్కన పెడితే ఇటీవల వైజాగ్ లో ఒక యూట్యూబ్ కార్యక్రమం జరిగింది. ఆ కార్యక్రమంలో షణ్ముఖ్ జస్వంత్ మరియు దీప్తి సునయన ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఒకే సమయంలో ఇద్దరు స్టేజిపై నిల్చున్నారు. ఆ సమయంలో దీప్తి సునయన గురించి షణ్ముఖ్ జస్వంత్ మాట్లాడుతూ కాస్త ఎక్కువగానే ఆమెపై ప్రశంసల వర్షం కురిపించాడు. దాంతో ఇద్దరి మధ్య విభేదాలు తొలగి పోయి మళ్లీ ప్రేమించుకుంటున్నారు, వచ్చే సంవత్సరం సమ్మర్ వారికి వీరి పెళ్లి ఉంటుంది అని ప్రచారం సోషల్ మీడియాలో జోరుగా సాగుతుంది. కానీ అసలు విషయం ఏంటంటే అవన్నీ కూడా ఒట్టి పుకార్లు మాత్రమే.. వాటిని నమ్మనవసరం లేదు.

Deepthi Sunaina And Shanmukh Jaswanth love story interesting update
అదే కార్యక్రమంలో షణ్ముఖ్ జస్వంత్ గురించి దీప్తి సునయన కనీసం ఒక్క మాట కూడా మాట్లాడలేదు, అతడు మాట్లాడుతున్న సమయంలో కనీసం పట్టించుకున్నట్లు కూడా ప్రవర్తించ లేదు. కనుక దీప్తి సునయనకు ఇంకా షణ్ముఖ్ జస్వంత్ పై కోపం తగ్గలేదని.. అతడు అంటే ఇప్పట్లో ప్రేమ వచ్చే అవకాశం లేదని తేలిపోయింది. కానీ కొందరు అభిమానులు మాత్రం వారిద్దరు కలవాలి, వారిద్దరు మళ్ళీ మళ్ళీ యూట్యూబ్ లో సందడి చేయాలని కోరుకుంటున్నారు. అది ఎంత వరకు సాధ్యమవుతుందో కాలమే సమాధానం చెప్పాలి, ప్రస్తుతానికి ఇద్దరు వేర్వేరుగా ఫుల్ బిజీగా ప్రాజెక్ట్స్ చేసుకుంటూ ఉన్నారు. వారిద్దరి కలయికలో మళ్లీ ప్రాజెక్ట్స్ రావాలని అభిమానులు కోరుకుంటున్నారు. కానీ అది సాధ్యమయ్యేలా లేదా అనేది చూడాలి.