Deepthi Sunaina : దీప్తి సునయన హీరోయిన్ కాబోతుందా.. దీనిపై ఈ బ్యూటీ సమాధానం ఏంటి?
Deepthi Sunaina : యూట్యూబ్ వీడియోల ద్వారా చాలా ఫేమస్ అయింది దీప్తి సునయన. ఈ ముద్దుగుమ్మ షణ్ముఖ్‌తో ఐదేళ్ల పాటు పీకల్లోతు ప్రేమలో మునిగి తేలింది. అయితే పరిస్థితులు ఏమో కాని అతనికి బ్రేకప్ చెప్పింది. డబ్ స్మాష్ వీడియోలతో మంచి గుర్తింపును అందుకున్న ఈ బ్యూటీ బిగ్ బాస్ లో కూడా అవకాశాన్ని అందుకుంది. వెండితెరపై కూడా నటించింది.గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారిన దీప్తి సునయనకి సంబంధించి తాజాగా ఓ వార్త సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది. టాలీవుడ్‌కు దీప్తి సునయన హీరోయిన్‌గా ఎంట్రీ ఇవ్వబోతోందంటూ కొన్ని మీమ్ పేజీలు హల్చల్ చేశాయి.
అయితే వీటిపై దీప్తి సునయన స్పందించింది. అవి ఫేక్ అంటూ కొట్టి పారేసింది. నాకు తెలీదే ఇది అంటూ కౌంటర్ వేసింది. మొత్తానికి దీప్తి సునయన మాత్రం ఇప్పుడు సిల్వర్ స్క్రీన్‌కు దూరంగానే ఉన్నట్టుంది. ప్రస్తుతం పెద్దగా యూట్యూబ్ వీడియోలు కూడా చేయని దీప్తి సునయన కేవలం సోషల్ మీడియా ద్వారా మాత్రమే అందరిని అలరిస్తుంది. అయితే షణ్ముఖ్ జశ్వంత్- దీప్తి సునయన.. వీళ్లిద్దరూ కలిసిపోతే ఎంత బాగుంటుందో.. అనుకునే అభిమానులు ఎంతమందో ఉన్నారు. వాళ్లని కలపడానికి కొంత మంది ట్రై చేస్తున్నారు కూడా.
deepthi sunaina check the rumors about her movies
Deepthi Sunaina ; తప్పుడు వార్తలకి చెక్..
ఇటీవల షణ్ముఖ్ తండ్రి మాట్లాడుతూ.. ‘వాళ్లిద్దరూ కలిసే ఉంటారు. బ్రేకప్ దీప్తి చెప్పింది, కానీ షణ్ముఖ్ ఎక్కడా చెప్పలేదు. వాళ్లిద్దరి వ్యక్తిగత విషయాల గురించి మనం ఎక్కువగా చర్చించకూడదు. కాకపోతే ఆ అమ్మాయికి ఏం అనిపించిందో తెలీదు కానీ సోషల్ మీడియాలో అలా పోస్ట్ పెట్టింది..’వాళ్లు కలవడానికి కొంత సమయం పడుతుందేమో కానీ కలిసే ఉంటారు. ఇది రెండు కుటుంబాలకు సంబంధించిన విషయం.. అంతా శుభమే జరుగుతుంది. ఈ విషయంలో అభిమానులు అనుమానించాల్సిన అవసరమే లేదు’ అని చెప్పుకొచ్చాడు.