deepthi sunaina enjoys in the snow
Deepthi Sunaina : యూట్యూబర్‌గా తెలుగు ప్రేక్షకుల మనసులు గెలుచుకున్న అందాల ముద్దుగుమ్మ దీప్తి సునయన.ఈ అందాల ముద్దుగుమ్మ బిగ్ బాస్ షోలోను సందడి చేసింది. షణ్ముఖ్‌తో ఎక్కువ క్లోజ్‌గాఉంటూ వార్తలలోనిలిచిన ఈ అమ్మడు అతడితో ప్రేమాయణం కూడా నడిపింది. ఆ విషయం అందరికి తెలిసే సరికి బ్రేకప్ కూడా జరిగింది. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా తెలియజేసింది దీప్తి సునయన. తోటి కంటెస్టెంట్ సిరితో హద్దులు దాటి ప్రవర్తించడంతో షణ్ముఖ్‌కి పూర్తి నెగెటివిటీ వచ్చింది. ఇమేజ్ సంగతి పక్కన పెడితే మొదటి నుంచి ప్రేమగా ఉంటున్న దీప్తి సునయన కూడా దూరమైంది.
అతనికి బ్రేకప్ చెబుతున్నట్లు సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది.షణ్ముఖ్ నుండి విడిపోయిన తర్వాత దీప్తి సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుంది. పలు రీల్స్‌తో పాటు వెబ్ సిరీస్, మ్యూజిక్ వీడియోలు వంటివి చేస్తుంది. దీప్తి గత కొద్ది రోజులుగా వాటికి సంబంధించిన అప్‌డేట్స్‌ని సోషల్ మీడియా ద్వారా అందిస్తూ వస్తుంది. తాజాగా ఈ అమ్మడు తోటి ఆర్టిస్ట్‌తో కలిసి మంచు ప్రాంతంలో సందడి చేసింది. ఇందులో ఇద్దరు కూడా వధూవరులు మాదిరిగా కనిపిస్తున్నారు. వీరిద్దరిని చూసి అభిమానులు పలు కామెంట్స్ పెడుతున్నారు. ప్రస్తుతం దీప్తి షేర్ చేసిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.
deepthi sunaina enjoys in the snow
కాగా బ్రేకప్ తర్వాత దీప్తి తన పనుల్లో తను బిజీగా మారిపోయింది. స్నేహితులను కలుస్తూ ఆ ఫొటోలను నెట్టింట్లో పంచకుంటోంది. షణ్ణూ మాత్రం దీప్తి మర్చిపోలేకపోతున్నట్లు తెలుస్తోంది. అందుకు అతని ఇన్‌స్టాగ్రామ్ ఫొటోలు, పోస్టులే నిదర్శనం. నిత్యం తన ప్రేయసిని గుర్తు చేసుకుంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నాడు. వారిద్దరు తిరిగి కలుస్తారని అందరు భావిస్తుండా, ఇప్పట్లో అది జరిగేలా కనిపించడం లేదు. అయితే దీప్తి కాని , షణ్ముఖ్ కాని సోషల్ మీడియాలో ఏ పోస్ట్ పెట్టిన కొద్ది నిమిషాలలోనే వైరల్ అవుతుంటుంది.
TGSRTC | దసరా పండుగను పురస్కరించుకుని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్‌ఆర్టీసీ) ప్రయాణికులకు శుభవార్త చెప్పింది. పండుగ సందర్భంగా…
OG Collections | సుజీత్ దర్శకత్వంలో పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందిన ఓజీ బారీ అంచనాల మధ్య సెప్టెంబర్…
OG | పవన్ కళ్యాణ్ తాజా చిత్రం ‘ఓజీ’ (ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్) టికెట్ ధరల పెంపుపై తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ…
Coconut | కొబ్బరి అంటేనే మనం వెంటనే ఆరోగ్యానికి మంచిదని భావిస్తాం. పచ్చి కొబ్బరి, కొబ్బరి నీళ్లు, కొబ్బరి నూనె…
Jackfruit seeds | రోజురోజుకూ మారుతున్న వాతావరణం, పుట్టుకొస్తున్న కొత్త వైరస్‌లు ప్రజల ఆరోగ్యాన్ని ముప్పుతిప్పులు పెడుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో…
Tulsi Leaves | హిందూ మతంలో పవిత్రంగా పరిగణించే తులసి చెట్టు కేవలం ఆధ్యాత్మిక కోణంలోనే కాకుండా, ఆరోగ్య పరంగా…
Garlic Peel Benefits | మన వంటగదిలో ప్రతిరోజూ వాడే వెల్లుల్లి యొక్క పేస్ట్, గుళికలే కాదు.. వెల్లుల్లి తొక్కలు…
Health Tips | వేగంగా బరువు తగ్గాలనుకునే వారు రోజులో ఎన్నో మార్గాలను ప్రయత్నిస్తుంటారు. వాటిలో టీ (చాయ్) ద్వారా బరువు…
This website uses cookies.