Shanmukh : మార్పుతో అసౌకర్యం.. షణ్ముక్‌తో దీప్తి సునయిన బ్రేకప్..? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Shanmukh : మార్పుతో అసౌకర్యం.. షణ్ముక్‌తో దీప్తి సునయిన బ్రేకప్..?

 Authored By mallesh | The Telugu News | Updated on :31 December 2021,8:15 am

Shanmukh : యూట్యూబర్ షణ్ముక్ జస్వంత్, ఆయన ప్రేయసి దీప్తి సునయిన మధ్య గ్యాప్ పెరిగిందని కొందరు నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. ‘బిగ్ బాస్’ సీజన్ ఫైవ్ కంటెస్టెంట్‌గా వెళ్లి రన్నరప్‌గా షణ్ముక్ జస్వంత్ నిలిచిన సంగతి అందరికీ విదితమే. అయితే, బిగ్ బాస్ హౌజ్‌లో షణ్ముక్ పర్ఫార్మెన్స్ పైన సోషల్ మీడియాలో విపరీతమైన డిస్కషన్ జరిగింది. సిరి హన్మంత్‌తో ఫ్రెండ్ షిప్ అంటూనే హగ్స్, కిస్సెస్, దుప్పట్లో దూరిపోవడాలు చూసి నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేశారు.

ఈ క్రమంలోనే తాను బిగ్ బాస్ హౌజ్ నుంచి బయటకు రాక ముందే తనపై దీప్తి సునయిన అలుగుతుందని షణ్ముక్ అన్నాడు. అలా షణ్ముక్ ఊహించినట్లుగానే దీప్తి సునయిన అలిగింది. షణ్ముక్‌ను బ్లాక్ చేసింది. ఈ విషయాలు షణ్ముక్ స్వయంగా చెప్పాడు. ఇన్ స్టా గ్రామ్ ఫాలోవర్స్ తో మాట్లాడుతుండగా ఈ విషయాలు షేర్ చేసిన షణ్ణు.. త్వరలో దీప్తి సునయినను కలుస్తానని అన్నాడు. దీప్తి సునయినను వదిలే ప్రసక్తే లేదని, అయితే, సిరి హన్మంత్ తనకు ఫ్రెండ్ మాత్రమేనని ఈ సందర్భంగా షణ్ముక్ తెలిపాడు.

deepthi sunaina instagram post shanmukh

deepthi sunaina instagram post shanmukh

Shanmukh : సిరి హన్మంత్ వల్లే షణ్ముక్‌, దీప్తి మధ్య దూరం..!

బ్రేకప్ లాంటిది ఏం లేదని షణ్ముక్ జస్వంత్ అన్నాడు. కానీ, దీప్తి సునయిన పరిస్థితి చూస్తే అలా కనబడటం లేదని కొందరు నెటిజన్లు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. దీప్తి సునయిన హ్యాపీగా తనకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ హ్యాపీగా గడిపేస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా ఇన్ స్టా గ్రామ్ వేదికగా పెట్టిన పోస్టు చర్చనీయాంశమవుతున్నది. మార్పు అసౌకర్యంగా ఉంటుందని, కానీ, మారక తప్పదని, ప్రతీ దానికి మార్గం ఉంటుందని దీప్తి సునయిన తెలిపింది. ఆ మాటలను బట్టి దీప్తి సునయిన బ్రేకప్ చెప్పేందుకు సిద్ధమైందని, అందుకే ఇటువంటి మాటలు మాట్లాడుతున్నదని స్పష్టమవుతున్నదని కొందరు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. చూడాలి మరి.. దీప్తి సునయిన అఫీషియల్‌గా ఈ విషయాలపైన ఎలా స్పందిస్తారో. నూతన సంవత్సరంలో షణ్ముక్ గురించి ఏం చెప్తుందో..

Advertisement
WhatsApp Group Join Now

mallesh

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది