Deepthi Sunaina Shanmukh : మా షన్నూ, దీప్తిని కూడా కలుపు రవి భయ్యా ప్లీజ్
యూట్యూబ్ సెన్సేషనల్ స్టార్స్ అయినా షణ్ముఖ్ జస్వంత్ మరియు దీప్తి సునైనా సుదీర్ఘ కాలం ప్రేమించుకుని ఇటీవలే విడిపోయిన విషయం తెలిసిందే. వీరిద్దరు విడిపోవడానికి కారణం బిగ్ బాస్ తెలుగు సీజన్ 5 అంటూ చాలా మంది బలంగా నమ్ముతున్నారు. బిగ్ బాస్ సీజన్ ఫైవ్ లో షణ్ముఖ్ జశ్వంత్ మరియు సిరిల మధ్య జరిగిన వ్యవహారం కారణంగానే దీప్తి సునైనా అతడికి బ్రేకప్ చెప్పింది అంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే ఆ విషయం లో బుల్లి తెర వర్గాల వారు మరియు వెండి తెర వర్గాల వారు మరియు ప్రేక్షకులు కూడా పెద్ద ఎత్తున చర్చించుకుంటున్నారు.
అభిమానులు వీరిద్దరూ మళ్లీ కలిస్తే చూడాలని ఉంది అంటూ కలలు కంటున్నారు. ఈ ఫిబ్రవరి 14న ఖచ్చితంగా వీరిద్దరు కలుస్తారేమో అంటూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. వీరిద్దరు మాత్రమే కాకుండా సిరి మరియు శ్రీహాన్ లు కూడా విడిపోయినట్లు గా గత కొన్ని రోజులుగా వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఆ ఇద్దరు సోషల్ మీడియా లో రెగ్యులర్ గా ఒకరికొకరు ఫోటోలను షేర్ చేసుకునే వారు.. కానీ గత కొన్ని రోజులుగా వారిద్దరూ కూడా ఎడమొహం పెడమొహం అన్నట్లుగా ఉంటున్నారు. ఈ సమయం లో యాంకర్ రవి ఇంట్లో వీరిద్దరు కలిశారు. యాంకర్ రవి వీరిద్దరిని కలిపినట్లుగా సమాచారం అందుతోంది.

Deepthi Sunaina Shanmukh fans request to anchor ravi
సిరి ని చెల్లి గా భావించే యాంకర్ రవి ఆమె పట్ల బాధ్యత తో శ్రీహాన్ ని ఒప్పించి ఇద్దరినీ ఏకం చేసినట్లుగా తెలుస్తోంది. ఇద్దరి మధ్య విభేదాలకు స్వస్తి చెప్పి కలిసి పోయినట్లు గా సమాచారం అందుతోంది. ఎలాగైతే శ్రీహాన్ మరియు సిరిలను యాంకర్ రవి కలిపాడో అలాగే మా దీప్తి సునైనా మరియు షణ్ముఖ్ లను కలపాలంటూ సోషల్ మీడియా ద్వారా షన్నూ మరియు దీప్తిల అభిమానులు వేడుకుంటున్నారు. ఈ విషయమై యాంకర్ రవి ఎలా స్పందిస్తాడో చూడాలి. యాంకర్ రవి తాజాగా షేర్ చేసిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆయన సిరి మరియు శ్రీ హరి లను కలిపి గొప్ప వ్యక్తిగా మారాడు. అలాగే దీప్తి సునైనా మరియు షణ్ముఖ్ లను కూడా కలిపి మరింత గొప్ప వ్యక్తిగా నిలుస్తాడా.. వారిద్దరి అభిమానుల కోరిక నెరవేర్చుతాడా అనేది చూడాలి.