Deepthi Sunaina Shanmukh : శ్రీ రెడ్డికి గట్టిగా ఇచ్చి పడేసిన షణ్ముఖ్ ..దీప్తి సునయనని త్వరలోనే కలుస్తాడంట..!
Deepthi Sunaina Shanmukh : యూట్యూబర్స్ షణ్ముఖ్ దీప్తి సునయన బ్రేకప్ వ్యవహారానికి సంబంధించి నిత్యం ఏదో ఒక వార్త హల్ చల్ చేస్తూనే ఉంటుంది. షణ్ముఖ్ బిగ్ బాస్ నుండి బయటకు వచ్చాక ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ఆమె బ్రేకప్ లెటర్‌ను కూడా పోస్ట్ చేసింది. తర్వాత ఏం జరిగిందనేది అందరికీ తెలిసిందే. ఈ తరుణంలో కొందరు దీప్తి సునయన నిర్ణయాన్ని కరెక్ట్ అంటూ వత్తాసు పలికారు. కానీ కొందరు మాత్రం పెదవి విరిచారు. కొందరైతే విమర్శలు కూడా చేశారు. దీప్తి సునయన నిర్ణయాన్ని తప్పు పడుతూ విమర్శించిన వారిలో నటి శ్రీరెడ్డి కూడా ఉన్నారు.
షణ్ముఖ్ జస్వంత్‌కు దీప్తి గుడ్ బై చెప్పింది ఓకే.. సిరితో ఏదో జరిగిందనే ఊహల్లో ఈమె విడిపోయింది కదా.. మరి అప్పుడు బిగ్ బాస్ సీజన్ 2లో పాల్గొన్నప్పుడు తనీష్‌తో దీప్తి చేసింది ఏంటి.. అప్పుడు ఆమె చేసిన రొమాన్స్‌కు ఏం పేరు పెట్టాలి అంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది. దీనిపై స్పందించిన దీప్తి.. రిలేషన్‌షిప్స్, బిగ్ బాస్ హౌస్ మీద అవగాహన లేదని, కానీ బిగ్ బాస్ షో ద్వారా చాలా విషయాలు నేర్చుకున్నానని ఆమె చెప్పింది. తాజాగా షన్ను నిర్వహించిన లైవ్ ప్రోగ్రామ్ లో చాలామంది దీప్తి గురించి అడిగిన ప్రశ్నలకు షన్ను ఈవిధంగా సమాధానం చెప్పాడు.

Deepthi Sunaina Shanmukh strong counter to sri reddy
Deepthi Sunaina Shanmukh : షణ్ముఖ్ కౌంటర్
దీప్తితో పర్సనల్‌గా మాట్లాడతానని చెప్పిన షణ్ముఖ్.. శ్రీ రెడ్డి వ్యాఖ్యలపై కూడా ఇన్‌డైరెక్ట్‌గా స్పందించాడు. ఎవరి లైఫ్ వాళ్ళు చూసుకుంటే బాగుంటుంది అని ఇన్ డైరెక్ట్ గా శ్రీ రెడ్డిని ఉద్దేశించి స్టోరీస్ పెడుతున్నాడని షన్ను ఫ్యాన్స్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తుంది. కాగా, బిగ్ బాస్ 5 నుంచి బయటికి వచ్చిన తర్వాత.. దీప్తి సునయన తన ప్రియుడికి గుడ్ బై చెప్పడం లేనిపోని అనుమానాలకు తావిస్తుంది. అక్కడ సిరి, షన్ముఖ్ మధ్య జరిగిన దాని గురించి చాలా హర్ట్ అయింది దీప్తి.అయితే ఈ కారణంతోనే బ్రేకప్ చెప్పిందా, లేక ఇతర కారణాలు ఉన్నాయా అనేది తెలియాల్సి ఉంది.