Deepthi Sunaina : రీల్ లైఫ్‌లోను దీప్తి సునయనకి కష్టాలేనా.. ప్రేమలో మోసపోయిందా..!
Deepthi Sunaina : యూట్యూబ్ వీడియోలతో ఫుల్ పాపులర్ అయిన దీప్తి సునయన కొద్ది రోజుల క్రితం షణ్ముఖ్‌కి బ్రేకప్ చెప్పిన విషయం తెలిసిందే. బిగ్ బాస్ ఇంటి నుంచి షణ్ముఖ్ బయటకు వచ్చిన తరువాత దీప్తి అస్సలు పట్టించుకోలేదు. ఎక్కడా కూడా కలిసినట్టు ఫోటోలు బయటకు రాలేదు. పైగా షన్నుని బ్లాక్ చేసేసిందట. ఈ విషయాన్ని షణ్ముఖ్ స్వయంగా చెప్పాడు. అయితే ఇది జరిగిన కొద్ది రోజులకే దీప్తి సునయన అఫీషియల్‌గా తాను షణ్ముఖ్‌కి బ్రేకప్ చెప్పినట్టు ప్రకటించింది. షణ్ముఖ్ బిగ్ బాస్ హౌస్‌లో ఉండగా.. అతన గెలుపుకోసం ఎంతో కష్టపడింది దీప్తి.
అంతేకాదు.. అతని కెరియర్ స్టార్టింగ్ నుంచి ఆర్ధికంగానూ హెల్ప్ చేస్తూ సపోర్ట్‌గా నిలిచింది. సన్నూ గెలుపునే తన గెలుపు అనుకుని అన్ని విషయాల్లో అతనికి తోడుగా నిలిచింది.సిరి హనుమంత్‌కి షణ్ముఖ్ దగ్గర కావడంతో.. హగ్‌లు ముద్దులతో రెచ్చిపోయి ప్రవర్తించడం.. హద్దులుదాటి రొమాన్స్ చేయడం.. ఒకర్నివిడిచి ఒకరం బతకలేం అన్నట్టుగా వ్యవహరించడం చూసి చాలామంది ముక్కున వేలేసుకున్నారు. ఏ సీజన్‌లోనూ లేనంత గబ్బుని ఈ సీజన్‌లో చూపించారు షణ్ముఖ్, సిరిలు. మాటి మాటికి హగ్‌లు చేసుకుని ముద్దులు పెట్టుకుని.. ఒకే బెడ్‌పై ఒకే దుప్పట్లో పడుకుని ఫ్యామీలీ ఆడియన్స్ ముక్కున వేలేసుకునేలా ఈ ఇద్దరు చేశారు.

deepthi sunaina shares interesting video
Deepthi Sunaina : దీప్తి అదరగొట్టిందిగా..!
ఇది చాలా భరించింది దీప్తి.షణ్ముఖ్ బిగ్ బాస్ హౌజ్ నుండి బయటకు రాగానే అతనికి బ్రేకప్ చెప్పి తన పని తాను చేసుకుంటూ వెళుతుంది. కొన్ని మ్యూజిక్ ఆల్బమ్స్ చేస్తున్నట్టు తెలుస్తుండగా, తాజాగా ఓ వీడియో షేర్ చేసింది. ఏమై ఉండొచ్చో అంటూ సాగే ఈ పాటలో ఇద్దరు అమ్మాయిల మధ్య నలిగే ఓ వ్యక్తి ఆధారంగా దీనిని షూట్ చేసినట్టు తెలుస్తుంది. ఇందులోను దీప్తి లవ్ కోసం ఎంతో బాధపడుతున్నట్టుగా కనిపిస్తుంది. ఇది షణ్ముఖ్‌కి టచ్ అయ్యేలా ఉంటుందో లేదా అని మార్చి 8న తెలియనుంది. ఆ రోజు ఫుల్వీడియో విడుదల చేయనున్నారు.
View this post on Instagram