Deepthi Sunaina : వాలంటైన్స్ డే రోజు దీప్తి సునయన షాకింగ్ పోస్ట్.. మిమ్మల్ని వేరే వాళ్లు సంతోషంగా ఉంచలేరు…!
Deepthi Sunaina : బుల్లితెర క్రేజీ కపుల్ దీప్తి సునయన-షణ్ముఖ్ జస్వంత్ గత ఏదేళ్లుగా ప్రేమలో మునిగి తేలారు. బిగ్ బాస్ తర్వాత వీరి బంధానికి బీటలు ఏర్పడ్డాయి. షణ్ముఖ్ జశ్వంత్‌తో బ్రేకప్ చెప్పిన తరువాత దీప్తి సునయనలో చాాలా మార్పు వచ్చింది. చాలా యాక్టివ్ అయిపోయింది. అందరిలో కలిసి సందడి చేస్తోంది. ప్రేమ విఫలమైన బాధను దీప్తి సునయన కనిపించకుండా కవర్ చేస్తోంది. మరో వైపు షన్ను మాత్రం తన ప్రేమను, బ్రేకప్ బాధను గుర్తు చేసుకుంటూనే ఉన్నాడు. బీబీ జోడి ఈవెంట్‌లోనూ షన్ను బ్రేకప్ పాటకే డ్యాన్స్ వేశాడు. అయితే ఈ జంట కలుస్తారేమోనని వారి అభిమానులు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు.
కాని అది కలే అని అనిపిస్తుందని కొందరు కామెంట్ చేస్తున్నారు.ఈ మధ్య సమంతను దీప్తి సునయన ఫాలో అవుతోంది. సమంత పెట్టే కొటేషన్లనే దీప్తిసునయన పెడుతోంది. తన మాదిరిగానే కాస్త లోతుగా ఉండే పోస్ట్‌లు షేర్ చేస్తుంది. ఈ రోజు వాలంటైన్స్ డే సందర్భంగా దీప్తి సునయన ఎలాంటి పోస్ట్ పెడుతుందా అని అందరు ఆసక్తిగా ఎదురు చూశారు. కాని ఆమె తాజాగా ఓ షాకింగ్ పోస్ట్ పెట్టింది. సంతోషంగా ఉండటం అనేది ఒక స్వీయ బాధ్యత. మరొక వ్యక్తి మిమ్మల్ని సంతోషపరచలేడు అంటూ ఇన్‌డైరెక్ట్ కామెంట్స్ చేసింది. దీప్తి సునయన చేసిన ఈ ఆసక్తికర పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది.

deepthi sunaina surprising post in viral
Deepthi Sunaina : దీప్తి స్ట్రాంగ్‌గా ఉందా..
దీప్తి సునయన..షణ్ముక్‌కి ఇలా బ్రేకప్ చెబుతుందని ఎవ్వరూ ఊహించలేదు. బిగ్ బాస్ నుండి షన్ను బయటకు వచ్చిన తరువాత దీప్తి సునయన కలవకపోవడంతో అందరికీ అనుమానాలు వచ్చాయి. పైగా తన నంబర్ బ్లాక్ చేసిందంటూ షన్ను చెప్పిన మాటలు మరింతగా అనుమానాలు పెంచాయి. దీంతో ఆ అనుమానాలనే దీప్తి సునయన నిజం చేసింది. జనవరి 1న బ్రేకప్ చెప్పేసింది. షన్ను మాత్రం ఈ బ్రేకప్‌ను మనస్పూర్తిగా అంగీకరించినట్టు లేదు. ఇంకా దీప్తి సునయన కోసం వెయిట్ చేస్తున్నట్టు కనిపిస్తోంది.