Deepthi Sunaina : సముద్ర తీరాన చీరకట్టుతో.. భూమిని ముద్దాడిన దీప్తి సునైన.. వీడియో
Deepthi Sunaina : సోషల్ మీడియా ద్వారా బాగా పాపులర్ అయిన వారిలో ఒకరు దీప్తి సునైన. డబ్ స్మాష్ వీడియోస్ చేసి ఇన్ స్టా గ్రామ్, ఫేస్ బుక్ అకౌంట్స్‌లో పోస్ట్ చేసి వాటి ద్వారా చాలా మంది ఫాలోవర్స్ సంపాదించుకుంది దీప్తి. ఈ క్రమంలోనే దీప్తి సునైనకు తెలుగు పాపులర్ రియాలిటీ ‘బిగ్ బీస్ సీజన్ టూ’లో కంటెస్టెంట్‌గా చాన్స్ వచ్చింది. అలా తన పాపులారిటీని ఇంకా పెంచుకునే ప్రయత్నం చేసింది దీప్తి.
యంగ్ హీరో నిఖిల్ ‘కిరాక్ పార్టీ’ చిత్రంలో నటించిన దీప్తి సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుంది. సోషల్ మీడియా వేదికగా తన పర్సనల్, ప్రొఫెషనల్ విషయాలు షేర్ చేస్తుంటుంది. తాజాగా ఓ ఇంట్రెస్టింగ్ వీడియోను దీప్తి సునైన ఇన్ స్టా గ్రామ్ వేదికగా పోస్టు చేసింది. సదరు వీడియోలో బ్లూ అండ్ వైట్ కలర్ శారీ ధరించిన దీప్తి రివర్స్ ఫ్లిప్ చేసి భూమిని ముద్దాడుతోంది.
Deepthi Sunaina : చీరలో రివర్స్ ఫ్లిప్ చేసి.. భూమిని ముద్దాడిన దీప్తి..
ఓ వైపు అలలు వేగంగా తన వైపునకు వస్తుండగా, మరో వైపున దీప్తి చీరకట్టులో ఉన్న తన బాడీని బ్యాలెన్స్ చేసుకుంటూ బ్యాక్ సైడ్ ఫ్లిప్ చేసి మరీ భూమిని కిస్ చేస్తోంది. ఈ వీడియో చూసి నెటిజన్లు ఫిదా అయిపోతున్నారు. ఇకపోతే ‘సాఫ్ట్‌వేర్ డెవలపర్’ షార్ట్ ఫిల్మ్‌తో ఫుల్ పాపులారిటీ సంపాదించుకున్న యూట్యూబర్ షణ్ముక్ జస్వంత్‌తో దీప్తి రిలేషన్ షిప్‌లో ఉంది. గతంలో షణ్ముక్ జస్వంత్, దీప్తి సునైన పలు షార్ట్ ఫిల్మ్స్‌లో యాక్ట్ చేశారు. షణ్ముక్ ‘బిగ్ బాస్ సీజన్ ఫైవ్’ కంటెస్టెంట్‌గా హౌజ్ లో ఉన్నాడు.
View this post on Instagram