Dethadi Harika : ఓరినీ.. ఆ అబ్బాయిని పెళ్లి చేసుకుంటోందా.. దేత్తడి హారిక సూపర్ సెలక్షన్
Dethadi Harika : దేత్తడి హారిక తెలుసు కదా. ఒకప్పుడు సోషల్ మీడియా స్టార్. కానీ.. తనకు బిగ్ బాస్ సీజన్ 4 లో అవకాశం రావడంతో తనకు ఒక్కసారిగా ఫాలోయింగ్ పెరిగిపోయింది. ఆ తర్వాత పలు సినిమాలు, వెబ్ సిరీస్ లలోనూ నటించి తెలుగు ప్రేక్షకులను మెప్పించింది దేత్తడి హారిక. ఈ మధ్య హారిక పెద్దగా ఎక్కడా కనిపించలేదు. బిగ్ బాస్ 4 లో మాత్రం టాప్ 5 కంటెస్టెంట్లలో ఒకరిగా నిలిచిన హారిక.. జస్ట్ లో బిగ్ బాస్ 4 ట్రోపీని మిస్ చేసుకుంది. ఇక.. తన పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే దేత్తడి హారిక త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతోందట.
అవును.. త్వరలో హారిక ఓ ఇంటిది కాబోతోందట. దీనికి సంబంధించిన వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఓ అబ్బాయిని హారిక ప్రేమించిందట. ఇక.. ఆ అబ్బాయినే పెళ్లి చేసుకోవడానికి హారిక రెడీ అయిందట. ఆ అబ్బాయితో కలిసి చాలా వీడియోలలో నటించిన హారిక.. చివరకు అతడితోనే కలిసి జీవితాన్ని పంచుకోబోతోందని వార్తలు వస్తున్నాయి. తన తెలంగాణ భాషతో అందరినీ కట్టిపడేసేంది దేత్తడి హారిక. సోషల్ మీడియాలో తనకు వచ్చిన ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా తన భాషకే వచ్చింది. తెలంగాణ భాష, యాసలో అదరగొట్టే హారిక కొద్ది రోజుల్లోనే సోషల్ మీడియా స్టార్ గా ఎదిగింది.

dethadi harika marriage fixed
Dethadi Harika : తెలంగాణ భాషతో అందరినీ కట్టిపడేసే హారిక
ఆ తర్వాత బిగ్ బాస్ కు వెళ్లి తన ఫాలోయింగ్ ను ఇంకా పెంచుకుంది. ఇక.. బిగ్ బాస్ హౌస్ లో బిగ్ బాస్ 4 విన్నర్ అభిజీత్ తో కాస్త చనువుగానే ఉంది హారిక. ఆ తర్వాత బయటికొచ్చి మా మధ్య ఏం లేదంటూ ప్రకటించుకున్నారు ఇద్దరు. ఇప్పుడు ఒక యూట్యూబర్ ను త్వరలో హారిక పెళ్లి చేసుకోబోతోందట. అతడితో కలిసి పలు వీడియోలు కూడా చేసిందట. ఆ యూట్యూబర్ అందగాడని, టాలెంట్ ఉన్న వ్యక్తి అని చెబుతున్నారు. ఇంతకీ ఆ యూట్యూబర్ ఎవరు? పెళ్లి ఎప్పుడు.. నిజంగానే హారిక త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతోందా? లేక ఇదంతా ఉత్తుత్తి వార్తనా అనేది తెలియాలంటే కొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.