Devara Movie Public Talk : దేవర పబ్లిక్ టాక్, బ్లాక్ బస్టర్ అనిపించుకోవాలంటే ఎంత వసూళ్లు రాబట్టాలో తెలుసా..? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Devara Movie Public Talk : దేవర పబ్లిక్ టాక్, బ్లాక్ బస్టర్ అనిపించుకోవాలంటే ఎంత వసూళ్లు రాబట్టాలో తెలుసా..?

 Authored By ramu | The Telugu News | Updated on :27 September 2024,4:00 pm

ప్రధానాంశాలు:

  •  Devara Movie Public Talk : దేవర పబ్లిక్ టాక్.. బ్లాక్ బస్టర్ అనిపించుకోవాలంటే ఎంత వసూళ్లు రాబట్టాలో తెలుసా..?

Devara Movie Public Talk : ఎన్ టీ ఆర్ దేవర ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా విషయంలో ఎన్ టీ ఫ్యాన్స్ అంచనాలను సినిమా అందుకుంది. ఎన్ టీ ఆర్ యాక్షన్, డ్యాన్స్, ఎమోషన్ ఇలా అన్ని బాగ కుదిరాయని అంటున్నారు. ఐతే ఫ్యాన్స్ ఇలా చెబుతుంటే కామన్ ఆడియన్స్ మాత్రం ఇది మరో ఆచార్య అని అంటున్నారు. దేవర టాక్ ఐతే డివైడ్ గా నడుస్తుంది. ఐతే సినిమా ఈ టాక్ తో బ్లాక్ బస్టర్ అనిపించుకోవడం మాత్రం కష్టమని చెప్పొచ్చు.దేవర సినిమా వరల్డ్ వైడ్ గా 185 కోట్ల బిజినెస్ చేసింది. తెలుగు రెండు రాష్ట్రాల్లో ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్ నాగ వంశీ కొనేశారు. ఐతే దేవరకు వచ్చిన ఈ టాక్ తో ఆ రేంజ్ వసూళ్లు రాబడుతుందా అన్నది చెప్పడం కష్టం. మొదటి రోజు 60 నుంచి 80 కోట్ల దాకా గ్రాస్ రాబట్టినా అసలు కథ వీకెండ్ తర్వాత మొదలవుతుంది.

Devara Movie Public Talk దేవర సినిమాలో ప్లస్ ల కన్నా మైనస్ లు ఎక్కువ..

దేవర సినిమాలో ప్లస్ ల కన్నా మైనస్ లు ఎక్కువ ఉన్నాయి. సినిమా ఒక భాగంతో ముగించాల్సింది కానీ రెండు భాగాలు అంటూ అనవసరంగా ప్రయత్నించారు. దాని వల్ల చాలా వరకు సెకండ్ హాఫ్ లో ల్యాగ్ అయిన భావన వస్తుంది. దేవర సెకండ్ పార్ట్ కు ఇచ్చిన లీడ్ కూడా బాహుబలి సినిమాను ఫాలో అయ్యాడు కొరటాల శివ.

Devara Movie Public Talk దేవర పబ్లిక్ టాక్ బ్లాక్ బస్టర్ అనిపించుకోవాలంటే ఎంత వసూళ్లు రాబట్టాలో తెలుసా

Devara Movie Public Talk : దేవర పబ్లిక్ టాక్, బ్లాక్ బస్టర్ అనిపించుకోవాలంటే ఎంత వసూళ్లు రాబట్టాలో తెలుసా..?

మొత్తానికి బ్లాక్ బస్టర్ హిట్ టాక్ వస్తే తప్ప కలెక్షన్స్ మోత మోగే ఛాన్స్ లేదు అలాంటిది ఈ డివైడ్ టాక్ తో 185 కోట్లు రాబడుతుందా లేదా అన్నది చూడాలి. ఎన్ టీ ఆర్ ఫ్యాన్స్ మాత్రం దేవరతో సంతృప్తి చెందారు. దేవర సినిమా టాక్ తెలిసిపోయింది. ఇక మీదత వసూళ్లు అంతా కూడా ఎన్ టీ ఆర్ స్టామినా మీద ఆధారపడి ఉంటాయి.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది