Devatha 26 Oct Today Episode : సత్యను ఆదిత్య ముట్టుకోకపోవడంతో ఫ్యామిలీ మెంబర్స్ ఫైర్.. నన్ను వదిలేయ్.. అని ఆదిత్యకు చెప్పిన రుక్మిణి
Devatha 26 Oct Today Episode : దేవత సీరియల్ ఈరోజు ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 26 అక్టోబర్, 2021 ఎపిసోడ్ 374 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. రాధా.. తన పిల్లలను తీసుకొని తన భర్త దగ్గరికి వెళ్తుంది. పిల్లలకు స్కూల్ లో సైకిల్ పోటీలు పెట్టారట. దానికి నేను, మీరు వెళ్లాలట అని చెబుతుంది. దీంతో ఆఫీసర్ సార్ ను పిలిచిరా అంటే.. హా.. పిలిచాం. అతడు కూడా వస్తా అని మాటిచ్చాడు అని చెబుతారు పిల్లలు. దీంతో షాక్ అవుతాడు. ఆఫీసర్ సార్ వస్తే నేనెందుకు ఇక రావడం అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతాడు. ప్లీజ్ అమ్మ ఎలాగైనా నాన్నను ఒప్పించి తీసుకురా అమ్మ అని పిల్లలు రిక్వెస్ట్ చేస్తారు. మీ నాన్నకు నచ్చజెప్పి నేను తీసుకొస్తా అని చెబుతుంది రాధా.

devatha serial 26 october 2021 full episode
చూశావా రాధా.. ఆ ఆఫీసర్ కు నా పిల్లలే ఎక్కువైపోయారు. పిల్లలను ఇక నుంచి ఆఫీసర్ సార్ కు కలవకుండా చూడాలి.. అంటాడు. ఆఫీసర్ సార్ రాడు.. మీరు రండి అని అంటుంది రాధా. దీంతో షాక్ అవుతాడు. పిల్లలు ఆఫీసర్ సార్ ను పిలిచారు అన్నావు కదా అంటే ఆయన రాడు.. ముందు మీ ఫోన్ ఇవ్వండి అని చెబుతుంది. వెంటనే ఆదిత్యకు ఫోన్ చేస్తుంది కానీ.. ఆదిత్య ఫోన్ లిఫ్ట్ చేయడు. ఇంతలో బట్టలు సర్దుతున్న సత్య.. అతడి మీద పడుతుంది. దీంతో ఫోన్ కు చేయి తాకి ఫోన్ లిఫ్ట్ అవుతుంది. ఆదిత్య, సత్య మాట్లాడుకునే మాటలు అన్నీ రాధా వింటుంది.
నన్ను మా అక్కే మీకు ఇచ్చి వెళ్లింది కదా.. అయినా కూడా మీరు ఎందుకు నన్ను దూరం పెడుతున్నారు అంటుంది. మీ అక్కను నేను ఇప్పటికీ మరిచిపోలేకపోతున్నాను. నా గుండెల్లో మీ అక్కకే స్థానం ఉంది అని అంటాడు ఆదిత్య. వాళ్ల మాటలు విని తెగ ఏడ్చేస్తుంది రాధా. ఇంతలో ఫోన్ ఆన్ లో ఉన్న విషయం గుర్తించి.. హలో అంటాడు ఆదిత్య. దీంతో గుక్కపెట్టి ఏడుస్తుంది రాధా. నేను రాధను అని చెబుతుంది. దీంతో ఆదిత్య షాక్ అవుతాడు.
ఏంటి సార్ మీరు వద్దన్నా మా వెంట పడుతున్నారు. సైకిల్ పోటీలకు మీరు రావాల్సిన అవసరం లేదు. మేమున్నాం. మేము వెళ్తాం. మీకు అంతగా పిల్లలు కావాలనుకుంటే మీ పిల్లల కోసం ప్రయత్నించండి. మా పిల్లల మీద అంత ప్రేమ చూపించకండి అంటే.. ఎందుకు రుక్మిణి ఇలా మాట్లాడుతున్నావు అంటాడు ఆదిత్య. నేను రుక్మిణిని కాదు రాధా అంటుంది. మా గురించి వదిలేయండి. దయచేసి రేపు స్కూల్ కు రాకండి. కాదని వచ్చి అందరి ముందు అవమానపడకండి. ఇప్పటి వరకు ఇచ్చి మర్యాదను కాపాడుకుంటే బాగుంటుంది అని చెప్పి ఫోన్ కట్ చేస్తుంది రుక్మిణి.
సత్య ఏడ్చుకుంటూ రావడం దేవుడమ్మ చూస్తుంది. ఏమైంది ఎందుకు ఏడుస్తున్నావు అని అడుగుతుంది. ఇంట్లో వాళ్లు అందరూ వస్తారు. ఎందుకు ఏడుస్తున్నావు అని అడుగుతారు అందరు. అయినా ఆ గదిలో నుంచి ఎప్పుడూ ఏడుస్తూ తప్ప ఏనాడు నవ్వుతూ వచ్చింది అంటారు. వాడికి ఎన్నిసార్లు చెప్పినా అర్థం కావడం లేదు.. అని అందరూ అనుకుంటారు. నాగురించి ఆదిత్య అస్సలు ఆలోచించడం లేదు.. నన్ను పట్టించుకోవడం లేదు అంటుంది సత్య.
వెంటనే ఆదిత్యను అందరూ పిలుస్తారు. ఇంతలో ఆదిత్య కిందికి వస్తాడు. ఏమన్నావు సత్యను అని అడుగుతుంది దేవుడమ్మ. నేనేం అనలేదు అంటాడు ఆదిత్య. ఏం అనకపోతే ఎందుకు ఏడుస్తుంది అంటుంది దేవుడమ్మ. ఆడది ఏడిస్తే ఏ ఇంటికీ మంచిది కాదు. తనను నువ్వు పెళ్లి చేసుకున్నప్పటి నుంచి ఏడుస్తూనే ఉంది అంటుంది దేవుడమ్మ.
Devatha 26 Oct Today Episode : సైకిల్ పోటీలకు పిల్లలను తీసుకెళ్లిన రాధా
తర్వాత సత్యకు.. ఆదిత్య అన్నం తినిపిస్తాడు. దీంతో సత్య ఫుల్ ఖుషీ అవుతుంది. అందరూ సంతోషపడతారు. కట్ చేస్తే స్కూల్ లో సైకిల్ పోటీలు ప్రారంభం అవుతాయి. రాధా తన పిల్లలతో కలిసి స్కూల్ కు వెళ్తుంది. ఆదిత్య వచ్చాడేమో అని టెన్షన్ పడుతుంది. ఆ ఆఫీసర్ కొనిచ్చిన సైకిల్ పిల్లల దగ్గర ఉండటం నాకు అస్సలు నచ్చడం లేదు అంటాడు మాధవ్. దేవి బాధపడుతుందని ఏం మాట్లాడకుండా వదిలేశాను అంటాడు మాధవ్. నువ్వు ఆఫీసర్ రాడు అన్నావు కాబట్టి ఈ పోటీలకు వచ్చాను.. అంటాడు మాధవ్.

devatha serial 26 october 2021 full episode
ఇంతలో ఆఫీసర్ సార్ కోసం పిల్లలు వెయిట్ చేస్తుంటారు. నేను పిలిచా కదా ఎందుకు ఆఫీసర్ సార్ రావడం లేదు అని దేవి ఫీల్ అవుతుంది. పోటీలు ప్రారంభం అవుతాయి. దేవి ఫాస్ట్ గా సైకిల్ తొక్కుతూ వెళ్తుంది. మధ్యలో సైకిల్ నుంచి కింద పడుతుంది. దేవి లేచే సరికి ముందుగా వేరే పిల్లలు వెళ్లిపోతారు. దీంతో దేవి చాలా బాధపడుతుంది. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.