Ram Charan : రామ్ చరణ్-సుకుమార్ మూవీ కోసం రాక్‌స్టార్‌ని పట్టుకొస్తున్నారే..!
ప్రధానాంశాలు:
Ram Charan : రామ్ చరణ్-సుకుమార్ మూవీ కోసం రాక్‌స్టార్‌ని పట్టుకొస్తున్నారే..!
Ram Charan : అగ్ర దర్శకుడు సుకుమార్ Sukumar , గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ Ram Charan తిరిగి ప్రేక్షకులకి మంచి ఎంటర్‌టైన్ అందించేందుకు రెడీ అయ్యారు. ఈ ఇద్దరూ ఇంతకు ముందు ‘రంగస్థలం’ అనే ఒక అతి పెద్ద విజయవంతమైన సినిమా చేశారు. ‘రంగస్థలం’ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఇద్దరి స్టామినా ఏంటో ముందే నిరూపించింది. అలంటి ఈ ఇద్దరూ మళ్ళీ కలుస్తున్నారు, దీనికి ప్రస్తుతం Ram Charan రామ్ చరణ్ 17వ RC17 సినిమాగా పిలుచుకుంటున్నారు.
![Ram Charan రామ్ చరణ్ సుకుమార్ మూవీ కోసం రాక్‌స్టార్‌ని పట్టుకొస్తున్నారే](https://thetelugunews.com/wp-content/uploads/2025/02/Rarm-CHaran.jpg)
Ram Charan : రామ్ చరణ్-సుకుమార్ మూవీ కోసం రాక్‌స్టార్‌ని పట్టుకొస్తున్నారే..!
Ram Charan క్రేజీ కాంబినేషన్..
‘రంగస్థలం’ నిర్మించిన మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాకి నిర్మాతలు కాగా, ఈ మూవీకి దేవి శ్రీ ప్రసాద్‌ని Devi Sri Prasad ఫిక్స్ చేసినట్టు తెలుస్తుంది. రంగస్థలంకి కూడా దేవినే సంగీత దర్శకుడు కాగా, మరో సారి ఈ ముగ్గురు కలిసి పని చేస్తుండడంతో అంచనాలు రెట్టింపు అయ్యాయి. రంగస్థలం Rangasthalam టీమ్ మొత్తం మరోసారి కలిసిందంటూ ఫ్యాన్స్ ఉత్సాహంగా ఉన్నారు. ప్రస్తుతం RC17 హ్యాష్ ట్యాగ్ ట్రెండింగ్‌లో ఉంది. ఈ పాన్-ఇండియన్ సినిమా గురించి మరిన్ని అప్‌డేట్స్ త్వరలోనే ప్రకటించనున్నారు.
దర్శకుడు ఈ సినిమా కథని ‘రంగస్థలం’ కంటే ఎన్నో రేట్లు రామ్‌చరణ్ కెరీర్‌లో గుర్తుండిపోయే విధంగా రూపుదిద్దినట్టుగా తెలుస్తోంది. ‘రంగస్థలం’ రామ్ చరణ్ కెరీర్ లో నటుడిగా, కలెక్షన్స్ పరంగా ఎంతో ముఖ్యమైన సినిమా. అటువంటి సినిమా కన్నా ఇంకా పెద్ద స్కేల్ లో ఈ ఆర్సీ17 ఉండబోతోందని చెబుతున్నారు. పుష్ప2 Pushpa2తో సెన్సేషన్ క్రియేట్ చేసిన సుకుమార్ ఇప్పుడు రామ్ చరణ్‌కి ఎలాంటి బ్లాక్ బస్టర్ అందిస్తాడో చూడాల్సి ఉంది.