Ram Charan : రామ్ చరణ్ సినిమాకు ఆ టైటిల్ వద్దంటున్న ఫ్యాన్స్.. ఇంతకీ ఏం జరుగుతుంది..?
ప్రధానాంశాలు:
Ram Charan : రామ్ చరణ్ సినిమాకు ఆ టైటిల్ వద్దంటున్న ఫ్యాన్స్.. ఇంతకీ ఏం జరుగుతుంది..?
Ram Charan : గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ Ram charan గేమ్ ఛేంజర్ Game Changer రిజల్ట్ తో నిరాశ చెందినట్టు చెప్పొచ్చు. శంకర్ డైరెక్షన్ లో భారీ అంచనాలతో తెరకెక్కిన ఈ సినిమా విషయంలో నెగిటివ్ ట్రోల్స్ సినిమాపై బాగా ఇంపాక్ట్ అయ్యేలా చేశాయి. ఐతే ఏమాత్రం ఆలస్యం లేకుండా చరణ్ తన నెక్స్ట్ సినిమాకు షిఫ్ట్ అయ్యాడు. బుచ్చి బాబు సన డైరెక్షన్ లో రామ్ చరణ్ హీరోగా ఒక పీరియాడికల్ స్పోర్ట్స్ డ్రామా మూవీ సెట్స్ మీద ఉంది. ఈ సినిమాలో జాన్వి కపూర్ హీరోయిన్ గా నటిస్తుంది. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాకు ఏ.ఆర్ రహమాన్ మ్యూజిక్ అందిస్తున్నారు. రామ్ చరణ్ ఈ సినిమా కోసం మేకోవర్ చేసినట్టు తెలుస్తుంది. ఇదిలాఉంటే ఈ సినిమాకు టైటిల్ గా పెద్ది అనేది పరిశీలనలో ఉంది. ఐతే బుచ్చి బాబు ఈ టైటిల్ వేరే సినిమా కోసం పెట్టుకోగా చరణ్ కి చెబితే బాగుందని అన్నాడట.
Ram Charan : మెగా ఫ్యాన్స్ మాత్రం ఈ టైటిల్ వద్దని..
సో అలా ఆర్సీ 16 సినిమాకు పెద్ది టైటిల్ దాదాపు లాక్ అయినట్టే అని అంటున్నారు. ఐతే మెగా ఫ్యాన్స్ మాత్రం ఈ టైటిల్ వద్దని అంటున్నారు. పెద్ది టైటిల్ బాగాలేదని ఆ టైటిల్ పెడితే నెగిటివిటీ ఉంటుందని అంటున్నారు. సినిమా అన్ని భాషల్లో రిలీజ్ చేస్తున్న టైం లో అన్ని చోట్ల అర్ధమయ్యే టైటిల్ పెట్టాలని లేకపోతే కష్టమని అంటున్నారు.
మెగా ఫ్యాన్స్ చెబుతున్నది కూడా కరెక్టే.. ఈ టైటిల్ విషయంలో రాజమౌళి చాలా తెలివిగా ఉంటాడు. మరి ఈ పెద్ది టైటిలే ఫైనల్ చేస్తారా లేదా మెగా ఫ్యాన్స్ కోరిక మేరకు మారుస్తారా అన్నది చూడాలి. చరణ్ 16వ సినిమా బుచ్చి బాబు చేస్తుండగా 17వ సినిమా సుకుమార్ డైరెక్షన్ లో చేస్తుంది. తప్పకుండా ఈ సినిమాలతో రామ్ చరణ్ మరోసారి బాక్సాఫీస్ ఫైట్ కు సిద్ధమవుతున్నాడు. ఉప్పెన తర్వాత బుచ్చి బాబు చేస్తున్న ఈ సినిమా కూడా బ్లాక్ బస్టర్ టార్గెట్ తో వస్తున్నాడు. Ram Charan, RC16, Buchchi Babu, Mega Fans, A R Rahman