Saakini Daakini Movie : శాకిని డాకిని మూవీ ఆడియెన్స్ అంచనాలను అందుకుందా..? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Saakini Daakini Movie : శాకిని డాకిని మూవీ ఆడియెన్స్ అంచనాలను అందుకుందా..?

Saakini Daakini Movie : శాకిని డాకిని సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దర్శకుడు సుధీర్ వర్మ తెరకెక్కించిన ఈ చిత్రం మార్నింగ్ షో నుంచే డివైడ్ టాక్‌ను సొంతం చేసుకుంది. ఈ సినిమా లేడి ఓరియెంటెడ్ పర్పస్‌లో తెరకెక్కింది. ఇందులో నివేదా థామస్, రెజీనా కసాండ్ర కలిసి నటించారు.సినిమాలో నివేదా థామస్ శాలిని పాత్ర పోషించగా.. రెజీనా డామిని రోల్ పోషించింది. ఇక కథ విషయానికొస్తే హీరోయిన్లు ఇద్దరూ పోలీస్ అకాడమీలో ట్రెయినింగ్ కోసం జాయిన్ […]

 Authored By mallesh | The Telugu News | Updated on :16 September 2022,8:30 pm

Saakini Daakini Movie : శాకిని డాకిని సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దర్శకుడు సుధీర్ వర్మ తెరకెక్కించిన ఈ చిత్రం మార్నింగ్ షో నుంచే డివైడ్ టాక్‌ను సొంతం చేసుకుంది. ఈ సినిమా లేడి ఓరియెంటెడ్ పర్పస్‌లో తెరకెక్కింది. ఇందులో నివేదా థామస్, రెజీనా కసాండ్ర కలిసి నటించారు.సినిమాలో నివేదా థామస్ శాలిని పాత్ర పోషించగా.. రెజీనా డామిని రోల్ పోషించింది. ఇక కథ విషయానికొస్తే హీరోయిన్లు ఇద్దరూ పోలీస్ అకాడమీలో ట్రెయినింగ్ కోసం జాయిన్ అవుతారు.

Saakini Daakini Movie : కథలో లోపం ఎక్కడుంది..

పోలీస్‌ ట్రైనింగ్ కోసం అకాడమీలో జాయిన్ అయిన శాలిని, డామిని మధ్య ఇగో ప్రాబ్లమ్ తలెత్తుతుంది. కొన్నిఘటనల తర్వాత వీరిద్ద‌రు మంచి ఫ్రెండ్స్ అవుతారు.ఓ రోజు రాత్రి హీరోయిన్లు బ‌య‌ట‌కు వ‌చ్చిన‌ప్పుడు అనుకోకుండా ఓ అమ్మాయి కిడ్నాప్ అవుతారు. దానిని వీరిద్దరూ కలిసి చూస్తారు.అనంతరం ఆమెను కాపాడేందుకు శాలిని, డామిని ఏం చేశారు? ఈ కిడ్నాప్ వెన‌క ఉన్న‌దెవరు? అన్నదే సినిమా కథాంశం.. శాకినిడానికి సినిమా పరంగా ఇందులో కొన్ని ప్లస్‌లు మరికొన్ని మైనస్‌లు ఉన్నాయి. సినిమాకు ముఖ్యంగా కథ ప్లస్.. దర్శకుడు రాసుకున్న సీన్లు బాగున్నాయి.ఇక రెజీనా త‌న పాత్ర‌లో బాగా న‌టించింది. నివేదా కూడా కొన్ని ఎక్స్‌ప్రెష‌న్లు చ‌క్క‌గా పలికింది.

Did Saakini Daakini Movie Reach The Expectations Of Audience

Did Saakini Daakini Movie Reach The Expectations Of Audience

వీరిద్దరూ తమ నటనతో సినిమాకు ప్రాణం పోశారు. సినిమా క‌థ‌, పాత్ర‌ల చిత్రీక‌ర‌ణ బాగున్నా డైరెక్టర్ సుధీర్ వర్మ క‌థ‌ను చాలా స్లోగా ప్రారంభించాడు. సినిమాలో పాత్ర‌ల ప‌రిచ‌యానికే చాలా టైం వృథాగా పోతుంది. దీంతో ఫస్ట్ హాఫ్ చాలా స్లోగా మారింది. సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వ‌ర‌కు ఒకే ప్లాట్‌లో సినిమాను న‌డిపించ‌డంతో ప్రేక్షకులు కాస్త బోర్ ఫీలవుతారు.సెకండాఫ్‌లో కూడా పెద్దగా హీరోయిన్స్ ఎలివేషన్స్ సీన్స్ ఎక్కడా కనిపించలేదు.దర్శకుడిగా సుధీర్ వర్మ మరోసారి సినిమా ప్లావ్ చేశాడని ఫ్యాన్స్ అంటున్నారు.

mallesh

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది