SS Thaman : ఒక్క సినిమా కోసం తమన్ అన్నీ కోట్లు తీసుకున్నాడా .. ఓరి నాయనో !

Advertisement

SS Thaman : తెలుగు సినిమా పరిశ్రమలో ప్రజెంట్ ఎక్కడ చూసినా మ్యూజిక్ డైరెక్టర్ థమన్ పేరు వినబడుతోంది. మొన్నటివరకు కాపీ దర్శకుడిగా పేరొందిన థమన్ ప్రస్తుతం అందరి అంచనాలను తలకిందులు చేస్తున్నాడు. ఎవరూ ఊహించని విధంగా సంగీతం అందిస్తూ సినిమా సినిమాకు వైవిధ్యం కనబరుస్తున్నాడు. అందుకే థమన్ ప్రస్తుతం ఇండస్ట్రీలో నెంబర్ వన్ పొజిషన్ సొంతం చేసుకున్నాడు. దర్శకుడు బోయపాటి శ్రీనివాస్ పేరు వింటే చాలు. హీరోకు తన స్టైల్లో ఎలివేషన్స్ ఇస్తుంటాడు. అందుకు తగ్గట్టు మ్యూజిక్ చేయించుకుంటాడు. రీసెంట్‌గా వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన అఖండ మూవీ ఎంతపెద్ద హిట్టో అందరికీ తెలిసిందే.

ఇక ఈ సినిమాకు బోయపాటి ఎలివేషన్స్ ఎంత ప్లస్ అయ్యాయో.. మ్యూజిక్ కూడా అంత ప్లస్ అయ్యిందని చెప్పవచ్చు. బ్యాగ్రౌండ్ స్కోరింగ్ అద్భుతంగా రాబట్టాడు థమన్. ఈ నేపథ్యంలోనే థమన్ ప్రస్తుతం టాప్ మ్యూజిక్ డైరెక్టర్ హోదా అందుకున్నాడు. అంతే రేంజ్‌లో అవకాశాలు కూడా కొల్లగొడుతున్నాడు. రవితేజ నటించిన కిక్ సినిమాతో తొలిసారి సంగీత దర్శకుడిగా మారిన థమన్.. ఆ తర్వాతి రోజుల్లో అంచెలంచెలుగా ఎదిగాడు. అప్పట్లో దేవిశ్రీ ప్రసాద్ ఎంత క్రేజ్ సంపాదించుకున్నాడో ప్రస్తుతం థమన్ కూడా అదే రేంజ్ సక్సెస్‌ను అందుకున్నాడు.

Advertisement
Did SS Thaman take all the money for a single film
Did SS Thaman take all the money for a single film

SS Thaman : బోయపాటితో మరోసారి దోస్తి..

ఇక బ్యాండ్‌కు మరో పేరు తెచ్చకున్న థమన్.. తనసినిమాల్లో వైవిధ్యంగా సంగీతాన్ని అందిస్తున్నాడు. రీసెంట్‌గా మెగాస్టార్ నటించిన లూసిఫర్‌కు థమన్ అందించిన మ్యూజిక్ చాలా బాగుందని టాక్ వినిపిస్తోంది. అదేవిధంగా బోయపాటి త్వరలో రామ్ పోతినేనితో ఓ సినిమా చేయనున్నాడు. దానికి కూడా థమన్ మ్యూజిక్ అందిస్తున్నాడట.. దీని కోసం ఏకంగా రూ.4 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నాడని సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. అదే నిజమైతే థమన్ కెరీర్‌లో ఇదే హైయెస్ట్ రెమ్యూనరేషన్ కానుంది. కాగా, థమన్ చేతిలో ప్రస్తుతం తమిళ ప్రాజెక్టులు, త్రివిక్రమ్ మహేశ్ బాబు మూవీకి ప్రాజెక్టు కూడా ఉందని తెలుస్తోంది.

Advertisement
Advertisement