The Kerala Story : కేరళ స్టోరీ సినిమా కాపీ నా ? ఆ సినిమా నుంచి లేపెసారా ?
The Kerala Story : వివాదాస్పద చిత్రం “ది కేరళ స్టోరీ” మే 7వ తారీకు దేశవ్యాప్తంగా రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా విడుదలపై వ్యతిరేకత వ్యక్తమైన క్రమంలో దక్షిణాదిలో తమిళనాడు, కేరళ వంటి రాష్ట్రాలలో… ఈ సినిమా రిలీజ్ అయ్యే థియేటర్ ల వద్ద గట్టి బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ క్రమంలో కొన్ని రాష్ట్రాలలో థియేటర్ లో యాజమాన్యాలు చిత్రాన్ని ప్రదర్శించకూడదని ఆన్ లైన్ టికెట్ బుకింగ్ కూడా […]
The Kerala Story : వివాదాస్పద చిత్రం “ది కేరళ స్టోరీ” మే 7వ తారీకు దేశవ్యాప్తంగా రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా విడుదలపై వ్యతిరేకత వ్యక్తమైన క్రమంలో దక్షిణాదిలో తమిళనాడు, కేరళ వంటి రాష్ట్రాలలో… ఈ సినిమా రిలీజ్ అయ్యే థియేటర్ ల వద్ద గట్టి బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ క్రమంలో కొన్ని రాష్ట్రాలలో థియేటర్ లో యాజమాన్యాలు చిత్రాన్ని ప్రదర్శించకూడదని ఆన్ లైన్ టికెట్ బుకింగ్ కూడా తొలగించడం జరిగింది.
సినిమాకి పెద్ద ప్రమోషన్ జరగకపోయినా గానీ భారీ ఎత్తున పబ్లిసిటీ రావడం జరిగింది. దీంతో ఈ సినిమాకి ప్రస్తుతం విడుదలైన చోట్ల…. జనాలు క్యూ కడుతున్నారు. కొత్త సినిమాలు రామబాణం, ఉగ్రం కంటే “ది కేరళ స్టోరీ” సినిమాకి ఎక్కువ జనం చూడటానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. సెన్సార్ ఆలస్యం కావడం వల్ల తెలుగు వర్షన్ కాస్త ఆలస్యం అయ్యింది. అయితే “ది కేరళ స్టోరీ” సినిమా చూసిన తర్వాత ప్రేక్షకులు ఇది ఒరిజినల్ స్టోరీ కాదని కామెంట్లు చేస్తున్నారు.
2020లో నెట్ ఫ్లిక్స్ లో “కాలిఫెట్ అనే స్వీడిష్” అనే వెబ్ సిరీస్ ఆధారంగా తీసిన సినిమా అని చెబుతున్నారు. ఆ వెబ్ సిరీస్ లో కూడా బ్రెయిన్ వాష్ కు గురైన నలుగురు అమ్మాయిల చుట్టూ స్టోరీ ఉంటుంది. ఐసీసీ తీవ్రవాదులు వచ్చిన పడి ప్రమాదంలో నెట్టబడిన వైనాన్ని కళ్ళకు కట్టినట్లు… చూపిస్తారు. ఆ వెబ్ సిరీస్ లో బ్యాక్ డ్రాప్ యూరప్ అయితే… ది కేరళ స్టోరీ లో కేరళ నుంచి సిరియా అన్నట్టుగా చూపించారు పోలికలు చాలా వరకు….”కాలిఫెట్ అనే స్వీడిష్”కి దగ్గరగా ఉన్నాయని చెబుతున్నారు.