Director Nandini Reddy – Ashwini Dutt Daughter : “నోరు మూసుకుని సినిమా తీయ్యి ” డైరెక్టర్ నందిని రెడ్డి ని అశ్విని దత్ కూతురు అంత మాట అనేసిందా ?
Director Nandini Reddy – Ashwini Dutt Daughter : డైరెక్టర్ నందిని రెడ్డి తెలుగు చలనచిత్ర రంగంలో ఏకైక తెలుగు దర్శకురాలు. ఎన్నో వైద్యమైన సినిమాలు చేసి అదిరిపోయే విజయాలు సొంతం చేసుకున్నారు. వెరైటీ సబ్జెక్టులతో నందిని రెడ్డి తీసే సినిమాలు చూసే ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటాయి. హిట్స్ తో పాటు పరాజయాలు కూడా ఈ లేడీ డైరెక్టర్ అందుకోవటం జరిగింది. ప్రస్తుతం “అన్ని మంచి శకునములే”తో అనే మరో ఫీల్ గుడ్ మూవీతో తిరిగి బరిలో దిగుతున్నారు. ఈ సినిమా అర్జున్ రెడ్డి విడుదల అవకముందే విజయ్ దేవరకొండ కథ విన్ని ఎంతో మెచ్చుకున్నారని తాజా ఇంటర్వ్యూలో నందిని రెడ్డి చెప్పుకొచ్చారు.
ఆయనతో చేయాల్సిన సినిమా కానీ కుదరలేదు అని స్పష్టం చేశారు. ఆ తర్వాత సంతోష్ శోభన్ నీ ప్రధాన పాత్ర కోసం ఎంచుకున్నట్లు చెప్పుకొచ్చారు. ఈ సినిమాలో నటీనటుల ఎంపికలో నిర్మాత స్వప్నా దత్ పోషించిన పాత్ర గురించి ఇన్ డెప్త్ విషయాలను తాజాగా ఓ చాటింగ్ సెషన్ లో వెల్లడించారు. సినిమా కంటెంట్ పరంగా తనకంటే ఎక్కువగా నిర్మాత స్వప్నా దత్తు బలంగా నమ్మారని దీంతో ఆమె ఎక్కడా కూడా ఖర్చు విషయంలో వెనకడుగు వేయకుండా ఖర్చు పెడుతుంటే..
కొన్ని విషయాల్లో భయపడుతుంటే… నోరు మూసుకుని సినిమా తెరకెక్కించు నేను చూసుకుంటా అని ఆమె భరోసా ఇచ్చారు. నిజంగా నిర్మాత స్వప్న దత్తుకి ఈ సినిమాపై ఉన్న నమ్మకం చాలా గ్రేట్ అంటూ స్పష్టం చేయడం జరిగింది. “అన్నీ మంచి శకునములే” త్వరలో థియేటర్లలో విడుదల కాబోతోంది. ఒక హాయి మరో హాయి కలిస్తే అంత వినోదంగా ఉంటుంది ఈ సినిమా అని డైరెక్టర్ నందిని రెడ్డి చెప్పుకొచ్చారు.