Trivikram : ప్రకాశ్‌రాజ్ ఇంట్లో మందు బాటిల్స్ దొబ్బేసిన త్రివిక్రమ్, సునీల్..? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Trivikram : ప్రకాశ్‌రాజ్ ఇంట్లో మందు బాటిల్స్ దొబ్బేసిన త్రివిక్రమ్, సునీల్..?

 Authored By mallesh | The Telugu News | Updated on :11 October 2022,8:00 pm

Trivikram : త్రివిక్రమ్ శ్రీనివాస్ ప్రస్తుతం ఇండస్ట్రీలో అగ్రదర్శకుడిగా కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఇండస్ట్రీలోకి రాకముందు త్రివిక్రమ్, సునీల్ ఇద్దరూ కలిసి ఒకే రూమ్‌లో ఉండి అవకాశాల కోసం స్టూడియోలు తిరిగేవారని అప్పట్లో వీరిద్దరూ చెప్పుకొచ్చారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ అప్పట్లో అసిస్టెంట్ డైరెక్టర్ నుంచి డైరెక్టర్ స్థాయికి చేరుకున్నాడు. ఇక సునీల్ కూడా చిన్న చిన్న కామెడీ పాత్రలు చేస్తూ ఏకంగా కామెడీ ప్రపంచాన్ని కొన్నాళ్లు ఏలాడు. ఆ తర్వాత హీరో స్థాయికి చేరుకున్నాడు.

త్రివిక్రమ్ శ్రీనివాస్ చాలా కింద నుంచి పైస్థాయికి చేరుకున్నారు. అవకాశాల కోసం ఎదురుచూస్తున్న క్రమంలోనే అందివచ్చిన ప్రతి చాన్సును సద్వినియోగం చేసుకున్నాడు.త్రివిక్రమ్ కంటే సునీల్ ఇండస్ట్రీలో త్వరగా అడుగుపెట్టాడు. అనంతరం హీరోగా కొంతకాలం రాణించాడు.ఇక ప్రస్తుతం హీరో అవకాశాలు రాకపోకడంతో మళ్లీ క్యారెక్టర్ ఆర్టిస్టుగా, విలన్‌గా చేస్తూ వస్తున్నాడు. త్రివిక్రమ్ మాత్రం వరుసగా హిట్ సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, అల్లుఅర్జున్, యంగ్ టైగర్ ఎన్టీఆర్‌తో సినిమాలు చేస్తూ చాలా బిజీగా మారిపోయాడు. అగ్రదర్శకులతో సమానంగా సినిమాలు చేస్తున్నాడు. త్రివిక్రమ్ కెరీర్‌లో ఒకటి రెండు ప్లాపులు ఉన్నా హిట్స్ మాత్రం చాలానే ఉన్నాయి.

Director Trivikram Shares Hilarious Moment With Prakash Raj

Director Trivikram Shares Hilarious Moment With Prakash Raj

Trivikram : ప్రకాశ్‌రాజ్ ఇంట్లో ఇంత గోల చేశారా..

రీసెంట్‌గా త్రివిక్రమ్ నటించిన తొలిసినిమా నువ్వే నువ్వే 20 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా చిన్న ఈవెంట్ నిర్వహించారు. దీనికి దర్శకుడు త్రివిక్రమ్, హీరో తరుణ్, హీరోయిన్ శ్రియ, ప్రకాశ్ రాజ్ వంటి వారు హాజరయ్యారు. ఈ సందర్భంగా త్రివిక్రమ్ మాట్లాడుతూ.. సునీల్, తాను కలిసి ప్రకాశ్ రాజ్‌ను ఎంత ఇబ్బంది పెట్టారో గుర్తుచేసుకున్నారు. అతని వాచెస్ లాక్కోవడం, రాత్రి పూట ఇంటికి వెళ్లి మందు బాటిల్స్ కొట్టేయడం వంటివి చేశామని చెప్పుకొచ్చారు. అయినప్పటికి తమ గోలను ప్రకాశ్ రాజ్ చాలా ఓపికగా భరించాడని, తామిద్దరం ఏదో ఒకటి అవుతామని ముందుగా ప్రకాశ్ నమ్మాడని త్రివిక్రమ్ చెప్పుకొచ్చాడు.

YouTube video

Advertisement
WhatsApp Group Join Now

mallesh

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది