Hero Yash : ఆడు నీచ్ కమీన్ కుతేగాడు అంటూ హీరో యష్ పై పరోక్ష వ్యాఖ్యలు చేసిన టాలీవుడ్ యాంగ్ డైరెక్టర్..!!
Hero Yash : ప్రస్తుత రోజుల్లో క్రేజ్ దక్కించుకోవడానికి చాలామంది రకరకాలుగా వ్యవహరిస్తున్నారు. ఈ క్రమంలో సోషల్ మీడియా ప్రభావంతో ఓవర్ నైట్ లోనే సెలబ్రిటీలు అయిపోతున్నారు. ఫిలింనగర్ వద్ద బట్టలు విప్పి ఓ ప్రముఖ నటి చాలా పెద్ద పాపులర్ అయింది. ఇంటర్వ్యూలలో బూతులు మాట్లాడి కూడా ఓ సహా నటి.. ఇప్పుడు వరుస అవకాశాలు దక్కించుకుంటూ రంగుల ప్రపంచంలో మునిగితేలుతుంది. ఇక ఇదే కోవాలో టాప్ మోస్ట్ సెలబ్రిటీ లపై కామెంట్లు చేస్తూ గుర్తింపు దక్కించుకునే బ్యాచ్ కూడా కొన్ని సంవత్సరాల నుండి స్టార్ట్ అయింది.
ఈ రకంగా వ్యాఖ్యలు చేసి సోషల్ మీడియాలో వైరల్ అవుతూ.. తమకంటూ ఓ ఇమేజ్ క్రియేట్ చేసుకుంటున్నారు.కాగా ఇప్పుడు ఇదే తరహాలో టాలీవుడ్ ఇండస్ట్రీలో “కేరాఫ్ కంచరపాలెం” అనే సినిమా తీసిన డైరెక్టర్ వెంకటేష్ మహా చేరిపోయారు. విషయంలోకి వెళ్తే “కేజిఎఫ్” సినిమాతో దర్శకుడు ప్రశాంత్ నీల్.. అదేవిధంగా హీరో యాష్ ఇద్దరూ కూడా తిరుగులేని గుర్తింపు దక్కించుకోవడం తెలిసిందే. “KGF 2” గత ఏడాది ఏప్రిల్ నెలలో విడుదల అయ్యి.. ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో ఏకంగా ₹1000 కోట్లకు పైగానే కలెక్ట్ చేయడం జరిగింది. అయితే ఈ సినిమా పేరు ప్రస్తావించకుండా వెంకటేష్ మహా ఓ ఇంటర్వ్యూలో డైరెక్ట్ గా హీరో
యాష్ నీ ప్రశాంత్ నీల్ నీ బండ బూతులు తిట్టాడు. ఆయన చేసిన వ్యాఖ్యలు ఈ రీతిగా ఉన్నాయి….”నేను సినిమా పేరు చెప్పదలుచుకోవట్లేదు .. ఈ మధ్యకాలంలో ఆ సినిమా బాగా పాపులారిటీ దక్కించుకుంది.. ఓ మూవీలో తల్లి హీరోని ఒక కోరిక కోరుతుంది ..నువ్వు బాగా బంగారం సంపాదించి చాలా ధనవంతుడు కావాలి అని కోరుకుంటున్నాను అంటుంది ..దీంతో హీరో జనాలతో గనులు తవ్వించి బంగారం బయటకి తీస్తాడు.. లాస్ట్ లో అలా ఇలా మాటలు చెప్పి బంగారం తీసుకెళ్ళిపోతాడు ..అసలు వాడు హీరోనా.. వాడు నీచ్ కమీన్ కుత్తే..
వాడి చుట్టూ కొన్ని వేల మంది ఉంటారు ..అయినా కానీ వాడు ఇలాంటి పనిచేస్తాడు ..వాళ్ళందరినీ వదిలేసి ..ఆ బంగారాన్ని ఓ చోట పారదొబ్బుతాడు .. అసలు వాడిని ఎవరైనా హీరో అంటాడా..? నిజమైన హీరో ఇలాంటి పని చేస్తాడా..? దీనిని అసలు గొప్ప కథ అంటారా..? అలాంటి చెత్త కథని జనాలు ఎగబడి చూడడం ఏంటి ..? “అంటూ పరోక్షకంగా కేజిఎఫ్ సినిమాను.. సినిమాలో నటించిన హీరో యష్ ను.. డైరెక్టర్ ప్రశాంత్ నీల్ పై షాకింగ్ కామెంట్స్ చేశారు. దీంతో వెంకటేష్ మహా చేసిన కామెంట్స్ దక్షిణాది సినిమా రంగంలోనే వివాదాస్పదంగా మారాయి.