Venkatesh : వెంకటేశ్ ఫస్ట్ మూవీ విక్టరీ వెనుక ఉన్న ఇంట్రెస్టింగ్ స్టోరి మీకు తెలుసా?
Venkatesh : టాలీవుడ్ ఇండస్ట్రీలో దగ్గుబాటి ఫ్యామిలీ గురించి తెలియని వారు ఉండరు. ఇకపోతే ప్రొడ్యూసర్ డి.రామానాయుడు భారతదేశంలో అన్ని భాషల్లో చిత్రాలు తీసి గిన్నిస్ రికార్డుకు ఎక్కారు. వందకు పైగా చిత్రాలు నిర్మించి సినీ రంగంపైన తనకంటూ ఓ ప్రత్యేకమైన ముద్ర వేశారు. ఎంతో మంది కొత్త వారిని దర్శకులుగా, నటులుగా ఇంట్రడ్యూస్ చేశారు. ఈ క్రమంలోనే తన తనయుడు వెంకటేశ్‌ను కూడా హీరోగా టాలీవుడ్‌కు పరిచయం చేశాడు. కాగా, వెంకటేశ్ ఫస్ట్ మూవీ వెనుక వెరీ ఇంట్రెస్టింగ్ స్టోరి ఉంది.అదేంటంటే..
ఇండస్ట్రీకి రెండు కళ్లు అయిన సీనియర్ ఎన్టీఆర్, ఏఎన్‌ఆర్‌లతో సినిమాలు తీసిన రామా నాయుడు ఆ తర్వాత కాలంలో ఎంతో మంది కొత్త వారితోనూ చిత్రాలు తీశారు. ఇక రామానాయుడు వారసులుగా సురేశ్ బాబు, వెంకటేశ్ ఇండస్ట్రీకి రాగా, సురేశ్ బాబు ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. వెంకటేశ్ హీరోగా ఉన్నారు. వెంకటేశ్ తొలి చిత్రం ‘కలియుగ పాండవులు’ను రామానాయుడు ప్రొడ్యూస్ చేయగా, దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు దర్శకత్వం వహించారు.ఈ సినిమా ఎలా మొదలైందంటే.. ఒక రోజు రాఘవేంద్రరావుతో సినిమా తీయాలనుకున్న రామానాయుడు. తన తనయుడు వెంకటేశ్ కు ఫోన్ చేసి ఏం చేస్తున్నావ్ అని అడిగారట. అప్పుడు వెంకటేశ్ అగ్రరాజ్యం అమెరికాలో స్టడీస్ కంప్లీట్ చేసి ఖాళీగా ఉన్నాడు.
Venkatesh : ఆ విషయం ఆరు నెలలు నేర్చుకున్న వెంకటేశ్..
అలా తాను ఖాళీగానే ఉన్నానని చెప్పగా, వెంటనే ఇండియాకు రమ్మన్నాడు. అలా భారత్‌కు వచ్చిన వెంకటేశ్‌కు మొదటగా తెలుగు భాషను నేర్పించారు. వెంకటేశ్ ఆరు నెలల పాటు కష్టపడి తెలుగు మాస్టారు వద్ద తెలుగు నేర్చుకున్నాడు. అలా తెలుగు భాష నేర్చుకున్న వెంకీ.. ఫైట్స్, డ్యాన్స్ కూడా నేర్చుకుని తొలి సినిమాతోనే సక్సెస్ అందుకున్నాడు. అలా విక్టరీని తన పేరుగా మార్చుకున్నాడు వెంకీ మామ. వెంకటేశ్ ప్రజెంట్ ‘ఎఫ్ 3’ ఫిల్మ్‌లో నటిస్తున్నాడు. అనిల్ రావిపూడి డైరెక్షన్‌లో వస్తున్న ఈ పిక్చర్ ‘ఎఫ్ 2’కు సీక్వెల్.