Naresh : సీనియర్ నరేష్ ఆస్తుల విలువ తెలుసా.. అందుకే నాల్గవ పెళ్లికి కూడా రెడీ! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Naresh : సీనియర్ నరేష్ ఆస్తుల విలువ తెలుసా.. అందుకే నాల్గవ పెళ్లికి కూడా రెడీ!

 Authored By prabhas | The Telugu News | Updated on :2 January 2023,12:24 pm

Naresh : ఈ మధ్య కాలంలో సీనియర్ నటుడు నరేష్ తెగ వార్తల్లో నిలుస్తున్నాడు. ఇప్పటి వరకు ఆయన మూడు పెళ్లిళ్లు చేసుకున్నాడు. మూడు పెళ్లిళ్లు కూడా పెటాకులు అవ్వడంతో ఇప్పుడు నాలుగో పెళ్లికి సిద్ధం అయ్యాడు. మూడో భార్య రమ్య నుండి ఇటీవల విడాకులు తీసుకున్న నరేష్ తన తోటి నటి పవిత్ర లోకేష్ ని వివాహం చేసుకోబోతున్నట్లు అధికారికంగా ప్రకటించాడు. గత రెండు సంవత్సరాలుగా నరేష్ మరియు పవిత్ర లోకేష్ లు ప్రేమలో మునిగి తేలుతున్నారు. ఈ వయసులో వీరిద్దరి మధ్య ప్రేమ వార్తలు రావడం చాలా మందికి ఆశ్చర్యాన్ని కలిగించాయి. మొదట అవి ఫేక్ న్యూస్ అయి ఉంటాయి అని చాలా మంది భావించారు. కానీ అనుహ్యంగా నరేష్ మరియు పవిత్ర లోకేష్ లు ప్రేమలో ఉన్నారని కన్ఫర్మ్ అయింది.

వీరిద్దరూ కూడా ప్రేమించుకుని సహజీవనం కూడా సాగిస్తున్నారని వెళ్లడైంది. ఆ మధ్య ఒక హోటల్ లో రెడ్ హ్యాండెడ్ గా నరేష్ మరియు పవిత్ర లోకేష్ పట్టుబడ్డడంతో వార్తల్లో నిలిచారు. తాజాగా తాము ఇద్దరం పెళ్లి చేసుకోబోతున్నాం అంటూ నరేష్ మరియు పవిత్ర లోకేష్ ముద్దు పెట్టుకుని మరి ప్రకటించేశారు. ఈ సమయం లోనే నరేష్ యొక్క ఆస్తుల గురించి తెగ ప్రచారం జరుగుతుంది. నరేష్ హీరోగా చాలా సినిమాలు చేశాడు. అయితే ఆయన సంపాదించింది పెద్దగా ఏమి లేదు. కానీ ఆయన తల్లి విజయ నిర్మల నిర్మాతగా, దర్శకురాలిగా, హీరోయిన్ గా సుదీర్ఘ కాలం పాటు కొనసాగారు. ఆమె చెన్నైలో ఉన్నప్పటి నుండి కూడా పెద్ద మొత్తంలో సంపాదిస్తూ వచ్చారు. ఆమె సంపాదన ఇప్పుడు పదుల కోట్లు దాటి వందల కోట్లకు చేరింది. ఆ సంపాదనకు పూర్తిగా ఏకైక వారసుడైన నరేష్ పోటీ లేకుండా పూర్తి ఆస్తిని దక్కించుకున్నాడు.

Do you know the assets of senior actor Naresh

Do you know the assets of senior actor Naresh

వందల కోట్ల ఆస్తి పరుడైన నరేష్ నాలుగో పెళ్లి ఏంటి 40 పెళ్లిలైనా చేసుకోవచ్చు. అతడికి డబ్బుంది.. ఆ డబ్బుతో ఏమైనా చేయవచ్చు అంటూ నేటిజన్స్ కామెంట్ చేస్తున్నారు. నరేష్ తన తల్లి సంపాదించి ఇచ్చిన ఆస్తితో ఎంజాయ్ చేస్తున్నాడు అంటూ కొందరు ఇండస్ట్రీ వర్గాల వారు గుసగుసలాడుతున్నారు. తల్లి సంపాదించి ఇచ్చిన ఆస్తి మాత్రమే కాకుండా నరేష్ ఏడాదికి 15 నుండి 20 సినిమాల్లో నటిస్తున్నాడు. దాంతో కూడా కోట్ల రూపాయలు ఆయనకు వస్తాయి. అందుకే పవిత్ర లోకేష్ తో మళ్ళీ పెళ్లికి నరేష్ సిద్ధమయ్యాడు. ఆస్తి ఉంది.. అనుభవించే వయసు ఉంది కనుక పెళ్లి చేసుకోకుండా ఎందుకు ఉండాలని భావించాడేమో నరేష్.. అందుకే నాలుగో పెళ్లికి సిద్ధం అయ్యాడు.

Advertisement
WhatsApp Group Join Now

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది