Do you know what Sujeeth did for Pawan Kalyan fans
Pawan Kalyan Fans – Sujeeth : తెలుగు చలనచిత్ర పరిశ్రమలో చాలామంది దర్శకులు పవన్ కళ్యాణ్ కి అభిమానులు. దర్శకుడు సుజిత్ కూడా పవన్ కళ్యాణ్ వీరాభిమాని. ఈ విషయాన్ని స్వయంగా హరీష్ శంకర్ తెలియజేయడం జరిగింది. “గబ్బర్ సింగ్” సినిమా హిట్ అయిన సమయంలో ఫస్ట్ షో చూసి సుజిత్ థియేటర్ నుండి బయటకు వస్తూ పవన్ కళ్యాణ్ అంటూ అరుస్తున్న వీడియోని.. సోషల్ మీడియాలో విడుదల చేయడం జరిగింది. “OG” సినిమా ప్రకటన సమయంలో హరీష్ ఈ రీతిగా సుజిత్ పవన్ వీరాభిమాని అనీ అభిమానులకు క్లారిటీ ఇచ్చాడు. ఇదిలా ఉంటే ప్రస్తుతం “OG” సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ముంబైలో మొదటి షెడ్యూల్ భారీగా జరుగుతూ ఉంది.
Do you know what Sujeeth did for Pawan Kalyan fans
డ్రగ్స్ మాఫియా నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఒరిజినల్ గ్యాంగ్ స్టార్ గా పవన్ కనిపించనున్నట్లు సమాచారం. ఈ క్రమంలో సినిమాకి సంబంధించి వర్కింగ్ స్టిల్స్ పవన్ అభిమానులను ఆకట్టుకునే విధంగా డైరెక్టర్ సుజిత్ అన్ని దగ్గరుండి విడుదల చేస్తూ ఉన్నారు. “OG” సినిమాకి సంబంధించి ఇప్పటివరకు విడుదలైన స్టిల్స్ సినిమాపై అంచనాలను అమాంతం పెంచేశాయి. అయితే ఈ సినిమాలో ప్రత్యేకంగా పవన్ పక్కన ఎటువంటి హీరోయిన్ అయితే సూట్ అవుతుంది.. అనే కోణంలో కొంతమంది అభిమానులతో OG స్టార్ట్ చేయక ముందు డైరెక్టర్ సుజిత్ డిస్కషన్ చేసి..ప్రియాంక అరుల్ మోహన్ నీ సెలెక్ట్ చేయడం జరిగిందంట.
ఈ రీతిగా సినిమా స్టార్ట్ అయ్యాక స్టిల్స్ రిలీజ్ చేయడం అంతకుముందు నటీనటులను ఎంచుకోవడంతో పాటు ఫైట్స్ విషయంలో కూడా… చాలా శ్రద్ధ తీసుకోవడం జరిగిందంట. “OG”లో అన్ని కూడా అభిమానులు కోరుకునే విధంగా ఉండే రీతిలో పవన్ అభిమానిగా దర్శకుడు సుజిత్ చాలా జాగ్రత్తగా సినిమా తెరకెక్కిస్తున్నారట. ఇదే సమయంలో కొన్ని లొకేషన్స్ లో పవన్ కళ్యాణ్ ఫేస్ కట్ కి ఎలా ఉంటుంది అనేది సినిమా యూనిట్ వెళ్లక ముందే స్పెషల్ ఫోటోషూట్స్ తనపై చేసుకుని హీరో ఎలా ఉంటాడో అనేది… టెక్నికల్ గా చూసుకుంటూ చాలా ప్రత్యేకంగా ఈ ప్రాజెక్టుపై డైరెక్టర్ సుజిత్ శ్రద్ధ తీసుకుంటున్నట్లు పవన్ కళ్యాణ్ అభిమానులకు ఫుల్ మీల్స్ “OG” రూపంలో ఇవ్వటానికి రెడీ అవుతున్నట్లు సమాచారం.
Vivo | స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో గట్టి పోటీ నడుస్తున్న ఈ రోజుల్లో ప్రముఖ మొబైల్ బ్రాండ్ వివో (Vivo) తన…
Jupitar Price | దేశవ్యాప్తంగా జీఎస్టీ రేట్లలో మార్పులు సెప్టెంబర్ 22 నుంచి అమల్లోకి వచ్చిన నేపథ్యంలో, ప్రముఖ ద్విచక్ర…
Asia Cup 2025 | పాకిస్తాన్‌తో జరగబోయే ఫైనల్లో గెలిచి ఆసియా కప్ 2025 ట్రోఫీని కైవసం చేసుకోవాలని సూర్య…
Aghori | రాష్ట్రంలో సంచలనం సృష్టించిన అఘోరీ – వర్షిణి వ్యవహారం మళ్లీ వార్తల్లోకెక్కింది. అఘోరీని పోలీసులు అరెస్ట్ చేసి…
Raja Saab | రెబల్ స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతో ఈగర్ వెయిట్ చేస్తున్న చిత్రాల్లో 'రాజాసాబ్' ఒకటి. చాలా…
Telangana | తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు దంచికొడుతున్నాయి. రాష్ట్రంలో ఇప్పటికే పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తుండగా, వచ్చే రెండు…
Makhana | బరువు తగ్గాలనుకుంటున్నారా? డయాబెటిస్‌ను నియంత్రించాలనుకుంటున్నారా? ఎముకల బలహీనతతో బాధపడుతున్నారా? అయితే మీరు మఖానాను తప్పక మీ రోజువారీ…
Salt | ఉప్పు లేకుండా మన రోజువారీ ఆహారం అసంపూర్ణమే. వంటల్లో రుచి కోసం, ఆహారంలో ఫ్లేవర్ కోసం, చివరికి…
This website uses cookies.