Virupaksha Movie : ప్రస్తుతం టాలీవుడ్ వ్యాప్తంగా చర్చనీయాంశం అవుతున్న సినిమా విరుపాక్ష. యాక్సిడెంట్ తర్వాత కోలుకొని కొన్ని నెలల రెస్ట్ తర్వాత సాయి ధరమ్ తేజ్ నటించిన మూవీ ఇది. ఈ సినిమా పెద్దగా అంచనాలు లేకుండా విడుదలయింది. కానీ.. బాక్సాఫీసు వద్ద మంచి విజయాన్నే దక్కించుకుంది. ఈ సినిమాకు విడుదలయిన కొన్ని రోజులకు మౌత్ టాక్ ద్వారా హిట్ టాక్ రావడంతో జనాలు ఇప్పుడిప్పుడే ఈ సినిమాను చూడటానికి థియేటర్లకు వెళ్తున్నారు. సంయుక్త మీనన్ ఈ సినిమాలో హీరోయిన్. యంగ్ డైరెక్టర్ కార్తీక్ దండు ఈ సినిమాకు డైరెక్టర్.
సినిమా విడుదలై ఈరోజుకు 5 రోజులు అవుతోంది. ఈ సినిమా వీకెండ్ లో అయితే రూ.20 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. యూఎస్ లోనూ ఈ సినిమా దూసుకుపోతోంది. వసూళ్లు బాగానే వస్తుండటంతో ఈ సినిమాకు సీక్వెల్ తీయాలని మూవీ యూనిట్ భావిస్తోందట. నిజానికి ఈ సినిమా ఎండింగ్ లోనే సీక్వెల్ ఉన్నట్టుగా హింట్ ఇచ్చారు కానీ.. ఒకవేళ సినిమా హిట్ అయితే అప్పుడు సీక్వెల్ గురించి ఆలోచించాలని మూవీ యూనిట్ భావించింది. ఇప్పుడు సినిమాకు మంచి టాక్ వస్తుండటంతో ఇక సీక్వెల్ ను అనౌన్స్ చేసే యోచనలో మూవీ యూనిట్ ఉన్నట్టు తెలుస్తోంది.
సినిమా క్లయిమాక్స్ లో తేజు కళ్లు చిత్రంగా మారడం తెలుసు కదా. ఎండ్ కార్డ్ పడగానే.. హీరో కూడా దయ్యం పట్టినట్టుగా కనిపిస్తాడు. అంటే సినిమా ఇంకా పూర్తవలేదు.. అనే హింట్ ఇచ్చారు. సెకండ్ పార్ట్ ఉంది అన్నట్టుగా చెప్పుకొచ్చారు. దీనిపై ఓ నెటిజన్.. సాయిధరమ్ తేజ్ ను అడగగా.. సీక్వెల్ ఉంది కాబట్టే.. హింట్ ఇచ్చాం అంటూ సాయి రిప్లయి ఇచ్చాడు. అంటే.. సినిమా కథను బట్టి ముందే సీక్వెల్ తీయాలని మూవీ యూనిట్ ప్లాన్ చేసుకున్నట్టు తెలుస్తోంది. ఏది ఏమైనా.. విరూపాక్ష సినిమా విజయంతో సాయి ధరమ్ తేజ్ మంచి జోరుమీదున్నాడు. విరూపాక్ష 2 షూటింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందో వేచి చూడాల్సిందే.
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.