Chandra Mohan : కే. విశ్వనాథ్ సినిమాలో చంద్రమోహన్ తమ్ముడి కూతురు.. ఆ తర్వాత ఏమైందంటే..
Chandra Mohan : సినీ ఇండస్ట్రీలో తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్న నటుల్లో చంద్ర మోహన్ ఒకరు. ఒకప్పడు వరుస సినిమాలతో హీరోగా ఓ వెలుగు వెలిగారు. హీరో, కమేడియన్, విలన్, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎన్నో సినిమాలు చేసి సూపర్ హిట్ అందుకున్నారు. ఆ తర్వాత క్యరెక్టర్ ఆర్టిస్ట్ ఆ రాణించి ప్రస్తుతం ఆరోగ్య రిత్యా సినిమాలకు దూరంగా ఉంటున్నారు. బి.ఎన్.రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన రంగుల రాట్నం సినిమాతో కెరీర్ స్టార్ట్ చేసిన చంద్రమోహన్ మొదటి […]
Chandra Mohan : సినీ ఇండస్ట్రీలో తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్న నటుల్లో చంద్ర మోహన్ ఒకరు. ఒకప్పడు వరుస సినిమాలతో హీరోగా ఓ వెలుగు వెలిగారు. హీరో, కమేడియన్, విలన్, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎన్నో సినిమాలు చేసి సూపర్ హిట్ అందుకున్నారు. ఆ తర్వాత క్యరెక్టర్ ఆర్టిస్ట్ ఆ రాణించి ప్రస్తుతం ఆరోగ్య రిత్యా సినిమాలకు దూరంగా ఉంటున్నారు. బి.ఎన్.రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన రంగుల రాట్నం సినిమాతో కెరీర్ స్టార్ట్ చేసిన చంద్రమోహన్ మొదటి సినిమాతోనే ఉత్తమ నటుడిగా నంది అవార్డు అందుకున్నారు. ఈ చిత్రం నటుడిగా చంద్రమోహన్‌కు మంచి పేరు తీసుకొచ్చింది.
ఇప్పటివరకు 900కు పైగా చిత్రాల్లో నటించిన చంద్రమోహన్ 175 సినిమాల్లో హీరోగా నటించి స్టార్ డమ్ తెచ్చుకున్నారు. అప్పట్లో చంద్రమోహన్ కు నటించిన హీరోయిన్లు ఆ తర్వాత స్టార్ హీరోయిన్ గా ఎదిగారు.చంద్రమోహన్ సరసన నటించిన వాళ్లు స్టార్ హీరోయిన్స్ అయిపోతారనే సెంటి మెంట్ అప్పట్లో ఉండేది. ఈ కోవలోకే శ్రీదేవి, జయప్రద, జయసుధ, రాధిక, రాధ, విజయశాంతి వంటి హీరోయిన్లు వస్తారు. ఇక కృష్ణాజిల్లాలో 1945, మే 23న పుట్టిన చంద్రమోహన్ అసలు పేరు మల్లంపల్లి చంద్రశేఖర రావు. కాగా కళా తపస్వీ కే.విశ్వనాథ్ కి చంద్రమోహన కజిన్ అవుతారట. వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన సిరిసిరి మువ్వ సూపర్ హిట్ అందుకుంది.
మొదట్లో సీరియస్ హీరోగా నటించిన చంద్రమోహన్ ఆ తర్వాత బంగారు పిచుక వంటి కామెడీ సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అలాగే గంగ మంగ వంటి కొన్ని చిత్రాల్లో విలన్ గా కనిపించారు. అయితే చంద్రమోహన్ కు ఇద్దరు కూతుళ్లు ఉండగా వారిని మాత్రం సినిమాలకు దూరంగా పెంచారు. ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ తనలా వాళ్లు ఇండస్ట్రీలో అడుగు పెట్టి కష్టపెట్టడం ఇష్టం లేకే యాక్టింగ్ వైపు రానివ్వలేదని చెప్పాడు. కాగా ఇద్దరు కుమార్తెలు కూడా బాగా చదివి గోల్డ్ మెడల్స్ అందుకుని, మంచి ఉద్యోగాల్లో స్థిరపడ్డారని చెప్పారు.
Chandra Mohan: ప్రస్తుతం స్టాఫ్ట్ వేర్ గా..
అయితే చంద్రమోహన్ తమ్ముడు కూతురు సబిత మంచి క్లాసికల్ డ్యాన్సర్. ఈ క్రమంలోనే ఓ ఈవెంట్ లో డాన్స్ చేస్తుండగా చీఫ్ గెస్ట్ గా వచ్చిన కె.విశ్వనాథ్ తన సినిమాలో నటించమని అడిగారట. మంచి పాత్ర అవడంతో చంద్రమోహన్ చేయమని చెప్పినట్లు అంటుంటారు. దీంతో సబిత కె.విశ్వనాథ్ దర్శకత్వంలో వచ్చిన సప్తపది మూవీలో నటించగా ఆ సినిమా సూపర్ హిట్ అయ్యింది. ఈ సినిమా తర్వాత ఆమెకు ఎన్నో ఆఫర్లు వచ్చినా ఆమె నటించలేదు. ఆ తర్వాత పెళ్లి చేసుకుంది. ఇక ప్రస్తుతం సాఫ్ట్ వేర్ కంపెనీలో పని చేస్తుంది సబిత.
https://www.youtube.com/watch?v=vKefyHY7uLo&t=26s