Chandra Mohan : బయటపడ్డ చంద్రమోహన్ వీలునామా.. ఆస్తులన్నీ వాళ్లకే.. షాక్ లో ఫ్యామిలీ..!!
Chandra Mohan ; టాలీవుడ్ నటుడు చంద్రమోహన్ గారు గత కొన్ని రోజుల నుంచి అనారోగ్య సమస్యలతో బాధపడుతూ నవంబర్ 11న తుది శ్వాస విడిచిన సంగతి తెలిసిందే. చంద్రమోహన్ గారి మరణంతో ఆయన కుటుంబ సభ్యులు, సినీ ఇండస్ట్రీ శోకసంద్రంలో మునిగింది. ఆయన వయసు 82 ఏళ్లు. ఈయన తెలుగులో హీరోగా 175 సినిమాలలోకి పైకి నటించారు. హీరో గానే కాకుండా విలన్ గా, కమెడియన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎన్నో సినిమాలలో నటించారు. […]
Chandra Mohan ; టాలీవుడ్ నటుడు చంద్రమోహన్ గారు గత కొన్ని రోజుల నుంచి అనారోగ్య సమస్యలతో బాధపడుతూ నవంబర్ 11న తుది శ్వాస విడిచిన సంగతి తెలిసిందే. చంద్రమోహన్ గారి మరణంతో ఆయన కుటుంబ సభ్యులు, సినీ ఇండస్ట్రీ శోకసంద్రంలో మునిగింది. ఆయన వయసు 82 ఏళ్లు. ఈయన తెలుగులో హీరోగా 175 సినిమాలలోకి పైకి నటించారు. హీరో గానే కాకుండా విలన్ గా, కమెడియన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎన్నో సినిమాలలో నటించారు. ఆయన మొత్తం 932 సినిమాలలో నటించి తెలుగు ప్రేక్షకుల హృదయాలలో మరిచిపోలేని నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు.
ఇక చంద్రమోహన్ భార్య జలంధర తెలుగు రచయిత్రి. ఇక వీళ్ళకి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. మొదటి కూతురు మధుర మీనాక్షి సైకాలజిస్ట్, రెండవ కూతురు మాధవి డాక్టర్ .చంద్రమోహన్ తన కూతుర్లను ఇండస్ట్రీకి పరిచయం చేయకుండా మంచి చదువులు ఇప్పించి మంచి హోదాకి వచ్చేలా చేశారు. ఇక చంద్రమోహన్ చివరిగా ‘ కోతల రాయుడు ‘ అనే సినిమాలో నటించారు. ఈ సినిమా కంటే ముందు చంద్రమోహన్ సినిమాలు చేయడంలో కాస్త స్లో అయ్యారు. వయసు పైబడటంతో ఈ మధ్యనే ఆయనకు అనారోగ్య సమస్యలు వచ్చాయని తెలుస్తోంది. ఈ క్రమంలోనే నవంబర్ 11న హృద్రోగ సమస్యతో అపోలో ఆసుపత్రిలో చేరి చివరికి తుదిశ్వాస విడిచారు.
అయితే చంద్రమోహన్ కి సంబంధించి వీలునామా ఒకటి బయటపడినట్లుగా తెలుస్తుంది. అందులో ఆయన ఆస్తుల గురించి ఉన్నట్లు తెలిసింది. చంద్రమోహన్ కి హైదరాబాదు చెన్నైలో కూడా భారీగా స్థిర ఆస్తులు ఉన్నాయని, ఈ మొత్తం ఆస్తుల విలువ 300 కోట్లకు పైనే ఉంటుందని తెలిసింది. అయితే ఆయన రాసిన వీలునామాలో ఆస్తి మొత్తం తమ కూతుర్లకు పంచి పెట్టాలని రాశారని తెలిసింది. ఇక తను మరణించిన తర్వాత ఎవరైతే తనకు కొరివి పెడతారో వారికి ఆస్తి లో 20 శాతం అందివ్వాలని రాసి ఉంది. అయితే ఆయనకి కొడుకులు లేరు అన్న సంగతి తెలిసిందే. ఈ వీలునామాలో ఎంత నిజం ఉన్నదో తెలియదు కానీ ఈ న్యూస్ మాత్రం హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది