Rajendra Prasad : నట కిరిటీ డా.రాజేంద్ర ప్రసాద్ పోగొట్టుకున్న గొప్ప సినిమా ఏదో తెలుసా..?
Rajendra Prasad : టాలీవుడ్ లో రాజేంద్ర ప్రసాద్ సినిమాలకి ఓ బ్రాండ్ ఉంటుంది. ఆయన సినిమా అంటే దర్శక, నిర్మాతలకే కాదు ప్రేక్షకులకీ ఇష్టం, ఆసక్తి ఎక్కువగా ఉంటాయి. అయితే ఆయన వద్దకి వచ్చిన ఓ అద్భుతమైన సినిమాను మిస్ చేసుకున్నారు. తమిళంలో భారీ హిట్ అందుకున్న సినిమా చిన్న తంబి. ఈ సినిమాలో ప్రభు, ఖుష్బూ జంటగా నటించారు. రేడియో రంగం నుంచి క్రియేటివ్ కమర్షియల్ అనే నిర్మాణ సంస్థను స్థాపించిన కె ఎస్ రామారావుతో అగ్ర నిర్మాత డా. డి రామానాయుడుతో కలిసి ఈ చిన్న తంబి చిత్రాన్ని చూశారు. కథ, కథనం అద్భుతంగా ఉండటంతో దాన్ని తెలుగులో రీమేక్ చేయాలనుకున్నారు.
ఈ సినిమాకి కథ అందించింది పి.వాసు. ఆయన దర్శకత్వంలో ఆ మధ్య వచ్చిన సినిమానే చంద్రముఖి. అయితే అదే పి.వాసుని పిలిచి తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా కొన్ని మార్పులు చెప్పమన్నారు. అప్పుడే హీరో వెంకటేశ్ అని కన్‌ఫర్మ్ చేశారు. ఇందులో వెంకీ పాత్ర చాలా అమాయకంగా ఉంటుంది. దీనికి ఇన్స్పిరేషన్ కమల్ హాసన్. ఆయన నటించిన స్వాతి ముత్యం సినిమాలో పాత్రని ఆధారంగా చేసుకొని తెలుగులో చంటి సినిమాలో వెంకీ పాత్రను డిజైన్ చేశారు. ఇక్కడ హీరోయిన్ గా మీనా నటించింది. అయితే ఈ సినిమాను రవి రాజా పినిశెట్టి దర్శకత్వంలో రాజేంద్ర ప్రసాద్ హీరోగా చేయాలనుకున్నారు.
Rajendra Prasad : సురేష్ బాబు వాళ్ళు వెంకీతో చేయాలని పట్టు పట్టారు.
కానీ సురేష్ బాబు వాళ్ళు వెంకీతో చేయాలని పట్టు పట్టారు. ముందు రాజేంద్ర ప్రసాద్ అనుకొని ఇప్పుడు వెంకటేశ్ తో అంటే నేను చేయను..అవసరమైతే ప్రాజెక్ట్ నుంచి తప్పుకుంటానని అన్నారు. ఈ వ్యవహారం మెగాస్టార్ వద్దకి కూడా వెళ్లింది. ఆయన కూడా వెంకటేశ్ తో చేస్తేనే బావుంటుందని సలహా ఇచ్చారు. అలా 1994 జూలై 4న మద్రాసు క్రియేటివ్ కమర్షియల్ ఆఫీసులో చంటి సినిమా మొదలైంది. ఇళయరాజా సంగీతం ఈ సినిమాకి పెద్ద ప్లస్. ఇక రవిరాజా పినిశెట్టి మేకింగ్ బాగా సెట్ అయి చంది భారీ హిట్ గా నిలిచింది. లేదంటే ఈ సినిమా రాజేంద్రప్రసాద్ ఖాతాలో చేరాల్సింది.