Drishyam Movie Repeat : దృశ్యం సినిమా రిపీట్.. ప్రియుడితో పారిపోయేందుకు తానే చనిపోయినట్టు నటన
ప్రధానాంశాలు:
Drishyam Movie Repeat : దృశ్యం సినిమా రిపీట్.. ప్రియుడితో పారిపోయేందుకు తానే చనిపోయినట్టు నటన
Drishyam Movie Repeat : ఈ రోజుల్లో మహిళలు ముదిరిపోతున్నారు. వివాహేతర సంబంధాల కోసం పండంటి సంసారం నాశనం చేసుకుంటున్నారు. గుజరాత్‌లోని పాటన్ జిల్లా, సంతాల్‌పుర్ తాలూకా పరిధిలోని జఖోట్రా గ్రామంలో జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. జఖోట్రా గ్రామానికి చెందిన గీతా అహిర్ (22) అనే వివాహిత, భరత్ (21) అనే యువకుడితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. భర్తకు తెలియకుండా భరత్‌తో కలిసి రాజస్థాన్‌కు పారిపోయి అక్కడ స్థిరపడాలని నిర్ణయించుకుంది.

Drishyam Movie Repeat : దృశ్యం సినిమా రిపీట్.. ప్రియుడితో పారిపోయేందుకు తానే చనిపోయినట్టు నటన
Drishyam Movie Repeat : ఎంత పని చేశారు..
ఇందుకోసం తాను చనిపోయినట్లు అందరినీ నమ్మించాలని ఓ ప్లాన్ వేసింది. ఈ ప్లాన్‌ను ప్రియుడు భరత్‌కు వివరించింది. భరత్ మంగళవారం రాత్రి సమయంలో ఒంటరిగా రోడ్డుపై వెళ్తున్న హర్జీభాయ్ సోలంకీ (56) అనే వ్యక్తిని అడ్డగించి హత్య చేశాడు. అనంతరం, ముందుగా అనుకున్నట్లుగా హర్జీభాయ్ మృతదేహాన్ని జఖోట్రా గ్రామ శివార్లలోని ఓ నిర్మానుష్య ప్రదేశానికి తరలించాడు. ఇక తాను చనిపోయినట్టు నమ్మించేందుకు ప్రియుడు భరత్‌తో కలిసి హర్జీభాయ్ శవానికి తన బట్టలు వేసి, కాళ్లకు గజ్జెలు తొడిగింది.
అనంతరం శవంపై పెట్రోలు పోసి నిప్పంటించి, ఇద్దరూ కలిసి అక్కడి నుంచి పారిపోయారు. తన మరణవార్త తెలిసి కుటుంబ సభ్యులు ఇక తన కోసం వెతకరని గీత భావించింది. కుటుంబ సభ్యులు కూడా గ్రామ శివార్లలోని కుంట సమీపంలో సగం కాలిన స్థితిలో ఉన్న మృతదేహాన్ని చూసి, అది గీతదేనని తొలుత భావించారు. కానీ, కాస్త పరిశీలనగా చూడగా అది పురుషుడి శవంగా గుర్తించారు. అప్పుడు పాలన్‌పుర్ రైల్వే స్టేషన్‌లో జోధ్‌పుర్ వెళ్లే రైలు కోసం ఎదురుచూస్తున్న వారిద్దరినీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.