RRR Movie : ఆర్ఆర్ఆర్ నష్టం అంతా జరిగిన తర్వాత ఇప్పుడు రిక్వెస్ట్ చేసి ఏం లాభం
RRR Movie : టాలీవుడ్ జక్కన్న రాజమౌళి దర్శకత్వం లో తెరకెక్కిన ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆర్ఆర్ఆర్ సినిమా కు సంబంధించిన విజువల్స్ ను యూట్యూబ్, ఫేస్బుక్, ట్విట్టర్ ఇలా అన్ని సోషల్ మీడియా ప్లాట్ఫారం లో షేర్ చేస్తూ హడావుడి చేస్తున్నారు. ముఖ్యమైన సన్నివేశాలను సోషల్ మీడియా ద్వారా షేర్ చేయడం తో ఇప్పటి వరకు చూడని ప్రేక్షకుల్లో ఆసక్తి తగ్గుతుంది అనేది ప్రతి ఒక్కరి మాట. చూసిన వారు ఉత్సాహం తో సోషల్ మీడియా లో తాము సినిమా చూశామని చెప్పుకోవడం కోసం ఆ సన్నివేశాలను షేర్ చేస్తున్నారు.
ఒకొక్కరు ఐదు నిమిషాల నుండి పది నిమిషాలు 15 నిమిషాలు వీడియోలను కూడా షేర్ చేయడం తో సినిమా పై ఆసక్తి తగ్గుతుంది అంటూ విశ్లేషకులు సైతం అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే సినిమా చూసిన లక్షలాది మంది వీడియోలను సోషల్ మీడియా ద్వారా షేర్ చేసి సినిమా ను ఖిల్ చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ సమయం లో నిర్మాణ సంస్థ నుండి ప్రకటన వచ్చింది. సినిమా కు సంబంధించిన క్లిప్స్ ను ఇలా షేర్ చేయడం ద్వారా ఈ సినిమాపై జనాల్లో ఆసక్తి తగ్గుతుంది. దయచేసి ఇలా చేయవద్దంటూ వారు విజ్ఞప్తి చేశారు.
సోషల్ మీడియాలో సన్నివేశాలను షేర్ చేసినప్పుడు సినిమాకు జనాలు రాకపోవచ్చు, తద్వారా సినిమా వసూళ్ళు తగ్గుతాయి అంటూ సోషల్ మీడియా ద్వారా నిర్మాత ఆవేదన వ్యక్తం చేశారు. కనుక సినిమా యొక్క సన్నివేశాలను యూట్యూబ్ లేదా ఇతర సోషల్ మీడియా ప్లాట్ఫారం లో షేర్ చేయవద్దు అంటూ విజ్ఞప్తి చేశారు. ఇప్పటికే లక్షల వీడియో లు సోషల్ మీడియా లో షేర్ అయ్యాయి. ఈ వీడియోలు సినిమా ను ఆల్రెడీ ఒక రేంజ్ లో చంపేశాయి అంటూ గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ సమయం లో ఇలా రిక్వెస్ట్ చేయడం విడ్డూరంగా ఉంది అంటూ నెటిజెన్స్ కామెంట్ చేస్తున్నారు.