Sreemukhi : శ్రీముఖిపై బాడీ షేమింగ్.. పంచ్‌తో అదరగొట్టేసిన ఇమాన్యుయేల్ | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Sreemukhi : శ్రీముఖిపై బాడీ షేమింగ్.. పంచ్‌తో అదరగొట్టేసిన ఇమాన్యుయేల్

 Authored By prabhas | The Telugu News | Updated on :24 May 2022,3:30 pm

Sreemukhi : బుల్లితెరపై శ్రీముఖి ప్రస్తుతం ఊపందుకునేలా ఉంది. గతంలో అయితే పటాస్ షోతో ఓ రేంజ్‌లో ఫేమస్ అయింది. పటాస్ యాంకర్‌గానే శ్రీముఖికి మంచి క్రేజ్ వచ్చింది. అలా వచ్చిన క్రేజ్ ద్వారానే శ్రీముఖికి బిగ్ బాస్ ఆఫర్ వచ్చింది.బిగ్ బాస్ షోకు వెళ్లే ముందు చాలానేకసరత్తు చేసింది. చాలా కష్టపడి సన్నబడింది. పటాస్ షోలో వచ్చినప్పుడు కాస్త లావుగా ఉన్న శ్రీముఖి.. బిగ్ బాస్ కోసం కాస్త తగ్గింది.అయితే మళ్లీ శ్రీముఖి లావుగానే మారింది. అయితే ఈ మధ్య మాత్రం మళ్లీ కసరత్తులు ప్రారంభించినట్టుంది.

కాస్త తగ్గింది. అయితే శ్రీముఖి మీద మాత్రం ఎప్పుడూ ఈ బాడీ షేమింగ్ డైలాగ్స్, సెటైర్లు పడుతూనే ఉంటాయి. స్కిట్లు, ఈవెంట్లు ఇలా అన్ని చోట్ల శ్రీముఖి భారీ కాయం మీద కౌంటర్లు వేస్తుంటారు. కానీ శ్రీముఖి మాత్రం వీటన్నంటిని కాస్త స్పోర్టీవ్‌గానే తీసుకుంటున్నట్టు కనిపిస్తుంది.శ్రీముఖి ప్రస్తుతం జాతి రత్నాలు అనే షోతో సందడి చేస్తోంది. మరో వైపు జీ తెలుగు సింగింగ్ ప్రోగ్రాంకు యాంకర్‌గా పని చేస్తోంది. ఈ రెండు షోలే శ్రీముఖి చేతిలో ఉన్నాయి. జాతి రత్నాలు స్టాండప్ కామెడీ షోలో శ్రీముఖి మీద ఎప్పుడూ కౌంటర్లు పడుతూనే ఉంటాయి.

emmanuel On Sreemukhi Body Shaming in Jathi Ratnalu Latest Week Promo

emmanuel On Sreemukhi Body Shaming in Jathi Ratnalu Latest Week Promo

అయితే తాజాగా రిలీజ్ చేసిన ప్రోమోలోనూ ఇలానే శ్రీముఖి భారీ కాయం మీద ఇమాన్యుయేల్ కౌంటర్లు వేశాడు.డేనియల్ శేఖర్ అంటూ ఇమాన్యుయేల్ సందడి చేశాడు. నా మొగుడు నాయక్ నాకు సూపర్ హీరో అని శ్రీముఖి అంటుంది. నీ మొగుడికి షుగర్ అని ఇమాన్యుయేల్ కౌంటర్ వేస్తాడు. నాయక్ భార్య అంటే నాయక్‌లో సగం అనుకుంటున్నావా? డబుల్ అని శ్రీముఖి అంటే.. చూస్తేనే తెలుస్తోంది నువ్ డబుల్ లావుగా ఉన్నావంటూ అని ఇమాన్యుయేల్ కౌంటర్ వేస్తాడు.

YouTube video

prabhas

Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి