Jabardasth : జబర్దస్త్ కు అసలు పరీక్ష మొదలు… మూల స్థంభాలు లేకుండా పరిస్థితి ఏంటో!
Jabardasth : జబర్దస్త్ కామెడీ షో కు జడ్జ్ లు ఎంత ముఖ్యమో జడ్జ్ లు మరియు యాంకర్ లు కూడా అంతే ముఖ్యం అనడంలో సందేహం లేదు. అందుకే జబర్దస్త్ కార్యక్రమంలో గెస్ట్ జడ్జ్ వచ్చిన సమయంలో ప్రేక్షకులు నిరాశ వ్యక్తం చేయడం చూశాం… యాంకర్ లు డల్ గా ఉన్న సమయంలో ప్రేక్షకుల నుండి అసంతృప్తి ని కూడా చూశాం. అందుకే యాంకర్ మరియు జడ్జ్ లు మరియు కమెడియన్స్ ప్రేక్షకులకు కనెక్ట్ అయిన వారు జబర్దస్త్ లో వస్తేనే జనాలు ఆధరిస్తారు. ఆ ఎపిసోడ్స్ కు మంచి రేటింగ్ మరియు వ్యూస్ వస్తాయంటూ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు అదే టెన్షన్ మల్లెమాల వారికి పట్టుకుందట.
అసలు విషయం ఏంటీ అంటే కమెడియన్ గా సుదీర్ఘ కాలంగా సెటిల్ అయిన వారిలో కొందరు మెల్ల మెల్లగా జబర్దస్త్ ను వదిలి వెళ్తున్నారు. తాజాగా హైపర్ ఆది కూడా జబర్దస్త్ కు గుడ్ బై చెప్పేశాడు. ఆయన లేకపోయినా ఆయన వెళ్లే వరకు చేసిన స్కిట్ లు టెలికాస్ట్ చేస్తూ వస్తున్నాయి. ఆయన చేసి వెళ్లిన స్కిట్స్ మొత్తం పూర్తి అయ్యాయి. ఇక నుండి ఆది లేకుండానే జబర్దస్త్ కార్యక్రమం ను టెలికాస్ట్ చేయాల్సి ఉంటుంది. అది చాలా కష్టమైన విషయంగా విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఆది వెళ్లి పోయిన చిరాకులో ఉంటే ఇప్పుడు రోజా కూడా గుడ్ బై చెప్పేసింది.
ఈ గురువారంతో జబర్దస్త్ లో మళ్లీ రోజా ఎప్పుడు కనిపించదు. ఇప్పటికే గుడ్ బై చెప్పిన ఎపిసోడ్ షూటింగ్ పూర్తి అయ్యింది.. అది రేపు గురు వారం టెలికాస్ట్ కాబోతుంది. కనుక జబర్దస్త్ కు కష్టాలు కంటిన్యూస్ గా కొనసాగుతున్నాయి. రోజా గత 9 సంవత్సరాలుగా కొనసాగుతూ వచ్చింది. ఇప్పటి వరకు ఆమె మద్యలో చిన్న చిన్న గ్యాప్ లు తీసుకుంది కాని వదిలి పెట్టలేదు. ఆమె ఉండటం వల్లే జబర్దస్త్ వెయిట్ పెరిగింది అనేది టాక్. నాగబాబు మరియు ఆమె కలిసి మొదట జడ్జ్ లు గా వ్యవహరించారు. నాగబాబు వెళ్లినా రోజా పూర్తి బాధ్యతను మోసింది. ఆమె కూడా వెళ్లడంతో వచ్చే వారం నుండి జబర్దస్త్ కు అసలు కష్టాలు కనిపించబోతున్నాయంటూ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.