Sudigali Sudheer : ఆది, ఇమాన్యుయేల్‌ల పరువుపాయే.. ఈటీవీ న్యూస్ యాంకర్లు మామూలోళ్లు కాదు
Sudigali Sudheer : తెలుగు వారికి ఈటీవీ వార్తలు, ఆ వార్తలు వచ్చే టైం వచ్చే మ్యూజిక్, ఆ థీమ్ వార్తలు చదివే న్యూస్ రీడర్లు అందరికీ తెలిసిందే. ఈ టీవీ వార్తలకు ఓ విశిష్టత ఉంటుంది. ప్రతీ రోజూ క్రమం తప్పకుండా ఈటీవీ వార్తలను వీక్షించే వారుంటారు. ప్రతీ రోజూ రాత్రి తొమ్మిది గంటలకు వచ్చే ఈ వార్తల కోసం ఎంతో మంది ఎదురుచూస్తుంటారు. టీవీ వార్తలు చదివే వారు ఎంత నిబ్బరంగా, గంభీరంగా ఉంటారో అందరికీ తెలిసిందే. వారి మొహంలో మరో ఎక్స్ ప్రెషన్ కనిపించరు. కేవలం వార్తలు చదువుతూ వెళ్తుంటారు. అలాంటి వారిని కూడా ఎంటర్మైన్మెంట్ షోలకు తీసుకొచ్చింది మల్లెమాల. ఈటీవీ 27వ వార్షికోత్సవం సందర్భంగా స్పెషల్ షోను చేసింది.
ఈ ఈవెంట్‌లో చిత్రసీమ నుంచి ఎంతో మంది గెస్టులు వచ్చారు. పోసాని కృష్ణమురళీ వచ్చాడు. ఈటీవీ సీరియల్స్ తారలు కూడా వచ్చారు. బయటకు వెళ్లిన సుధీర్, అనసూయ వంటి వారుకూడా వచ్చారు. ఇక ఇందులోనే ఓ స్పెషల్ పర్ఫామెన్స్ న్యూస్ రీడర్లతో ఇప్పించారు. నలుగురు న్యూస్ రీడర్లు న్యూస్ చదివేశారు. అది కూడా మన సుధీర్, ఇమాన్యుయేల్ గురించి. దీంతో అందరూ ఒక్కసారిగా పగలబడి నవ్వేశారు.ఎంతో సీరియస్‌గా అనిపించే, కనిపించే వాళ్లు ఇలా కామెడీ చేయడంతో అందరూ అవాక్కయ్యారు. ఇమాన్యుయేల్ పౌరసత్వాన్ని ప్రభుత్వం రద్దు చేసింది..
నైజీరియా, వెస్టిండీస్, కెన్యా వంటి తదితర దేశాలు ఇమాన్యుయేల్ మా వాడంటే మావాడంటూ కొట్టుకుచస్తున్నాయ్ అని వార్తలు చదివి అందరినీ నవ్వించేసింది. మరో యాంకర్ సుధీర్ మీద కౌంటర్లు వేసింది. తారాస్థాయికి చేరుతున్న సుధీర్ అభిమానుల అరాచకాలు.. పందుల పెంపకం వీడియో కింద సైతం వీ వాంట్ సుధీర్ అని కామెంట్లు పెడుతున్నారు. అని అలా వార్త చదవడంతోనే అందరూ అవాక్కయ్యారు. సుధీర్‌తో పాటు అక్కడున్నవారంతా కూడా పగలబడి నవ్వేశారు. అట్లుంటది మనతోని అంటూ డీజే టిల్లు స్టైల్లో ఇంకో యాంకర్ అనడంతో అందరూ ఆశ్చర్యపోయారు. మొత్తానికి న్యూస్ రీడర్ల స్కిట్ ఈ ఈవెంట్ మొత్తానికి హైలెట్ అయ్యేలా ఉంది.