Sridevi Drama Company : శ్రీదేవి కంపెనీ ఫేడ్ అవుట్ అవుతోంది.. కారణం ఇదే అంటున్న జనాలు
Sridevi Drama Company : జబర్దస్త్ కార్యక్రమం తర్వాత ఈటీవీలో ఆ స్థాయి విజయాన్ని సొంతం చేసుకున్న షో శ్రీదేవి డ్రామా కంపెనీ. మొదట ఒక సాధారణ కామెడీ షో గా మొదలైన శ్రీదేవి డ్రామా కంపెనీ సుడిగాలి సుదీర్ ఎంట్రీ తో ఎక్కడికో వెళ్ళి పోయింది. హైపర్ ఆది మరియు రాం ప్రసాద్ లు ఇద్దరు కలిసి షో యొక్క రూపం ను మార్చేశారు. శ్రీదేవి డ్రామా కంపెనీ భారీ విజయవంతం చేసుకున్న నేపథ్యం లో కొత్త కొత్త ప్రయోగాలను చేశారు. మంచి రేటింగ్ వస్తున్న సమయంలో సుడిగాలి సుదీర్ వెళ్లి పోవడం చర్చినీయాంశం అయింది.
ఆయన వెళ్లి పోయిన తర్వాత రష్మీ గౌతమ్ యాంకర్ గా బాధ్యతలు స్వీకరించిన విషయం తెలిసిందే.ఆమె యాంకర్ గా బాధ్యతలు తీసుకున్న తర్వాత కొన్నాళ్ల పాటు రేటింగ్ బాగానే వచ్చింది. కానీ ఈ మధ్య కాలంలో పెద్దగా ఆసక్తి కనబరిచే విధంగా శ్రీదేవి డ్రామా కంపెనీ ఉండడం లేదు. అందుకే రేటింగ్ చాలా తగ్గింది అంటూ సోషల్ మీడియా లో ప్రచారం జరుగుతుంది. ఈటీవి వర్గాల వారు కూడా అదే మాట్లాడుకుంటున్నారు. గతంతో పోలిస్తే శ్రీదేవి డ్రామా కంపెనీకి రేటింగ్ తగ్గడంతో కమెడియన్స్ ని కూడా తగ్గించారు. ఎక్కువగా ఫేమ్ లేని వారిని తీసుకొచ్చి కామెడీ చేయించే ప్రయత్నం జరుగుతోంది
అంటూ ప్రేక్షకులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. జడ్జ్ ప్లేస్ లో కూడా ఎవరిని పడితే వారిని తీసుకు రావడం వల్ల ప్రేక్షకులు ఆసక్తి చూపించడం లేదు. మొత్తానికి బుల్లి తెర పై మరో సంచలనం అనుకున్న శ్రీదేవి డ్రామా కంపెనీ గతంతో పోలిస్తే నిరాశ పరిచిందనే చెప్పాలి. అందుకు కారణం మల్లెమాల వారి యొక్క క్రియేటివ్ టీమ్. ప్రస్తుతానికి అయితే శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమాన్ని భారీ క్రేజ్ అయితే లేదు. మరి ముందు ముందు అయినా జబర్దస్త్ తరహాలో శ్రీదేవి డ్రామా కంపెనీకి మంచి రేటింగ్ దక్కుతుందేమో చూడాలి.