Tapsi : తాప్సీ ఆదాయం చూస్తే కళ్ళు తిరగాల్సిందే.. | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Tapsi : తాప్సీ ఆదాయం చూస్తే కళ్ళు తిరగాల్సిందే..

 Authored By govind | The Telugu News | Updated on :2 July 2021,11:00 am

Tapsi : సౌత్ స్టార్ తాప్సీ ఇప్పుడు బాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ బ్యూటీగా వెలుగుతోంది. ఎంట్రీ ఇచ్చింది టాలీవుడ్ అయినా ఈమె బాలీవుడ్ కే పరిమితం అయింది. మంచు మనోజ్ హీరోగా దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు తెరకెక్కించిన ఝుమ్మంది నాదం అనే సినిమాతో సౌత్ లో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది తాప్సి. ఇక్కడ అన్నీ కమర్షియల్ సినిమాలకి కేరాఫ్అడ్రెస్ గా మారింది. వరుసగా ఫ్లాప్ వచ్చినా కూడా ఈమె ప్రభాస్, వెంకటేశ్, రవితేజ, గోపీచంద్ లాంటి స్టార్ హీరోలతో నటించింది. టాలీవుడ్ లో ఎక్కువగా గ్లామర్ రోల్స్ నే చేసింది. అయితే తాప్సీ టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్స్ లిస్ట్ లో చేరలేకపోయింది.

everyone will be shocked If you look at Tapsi's income,

everyone-will-be-shocked If you look at Tapsi’s income,

దాంతో ఈమె బాలీవుడ్ మీద ఫోకస్ పెట్టింది. అక్కడ జుడ్వా 2 లో బికినీ వేసి గ్లామర్ ట్రీట్ ఇచ్చింది. అయితే అమితాబ్ బచ్చన్ తో చేసిన పింక్ సినిమాతో హిందీలో తనకి అద్భుతమైన పాపులారిటీ అండ్ క్రేజ్ వచ్చింది. దాంతో ఈమె కి అక్కడ కథా బలమున్న పాత్రల్లో నటించే అవకాశాలనే అందుకుంటోంది. చెప్పాలంటే బాలీవుడ్ లో తాప్సీ చాలా బిజీ హీరోయిన్. టాలీవుడ్ నుంచి బాలీవుడ్ కి వెళ్ళిన హీరోయిన్ అంత త్వరగా సక్సెస్ లు అందుకోలేరు. అక్కడ హిట్స్ దక్కక మళ్ళీ టాలీవుడ్ వైపు చూడటమో లేదా ఇంటికెళ్ళిపోవడమో చేస్తారు. కానీ తాప్సీ లక్కీ గాళ్. అక్కడ అడుగు పెట్టగానే స్టార్ హీరోయిన్ అయింది.

Tapsi : ముంబైలో ఇప్పటికే ఒక లగ్జరి అపార్ట్మెంట్ కూడా ఉన్నట్లు సమాచారం.

పింక్ సినిమాతో పాటుగా, తప్పడ్, మిషన్ మంగళ్, నాం శభానా, బద్లా వంటి క్రేజీ సినిమాలు చేసింది. అన్నీ సూపర్ హిట్స్ అవడంతో తన రెమ్యూనరేషన్ భారీగా పెరిగింది. దాంతో సినిమాకి 1.5 కోట్ల వరకు డిమాండ్ చేస్తున్న ఈ బ్యూటీ కొన్నిసార్లు బడ్జెట్ ను బట్టి చిన్న సినిమాలకు 80లక్షల వరకు తీసుకుంటోంది. ఈ నేపథ్యంలో తాప్సీ నికర ఆదాయం 2019 నాటికి 42.5 కోట్లని తెలుస్తోంది. ముంబైలో ఇప్పటికే ఒక లగ్జరి అపార్ట్మెంట్ కూడా ఉన్నట్లు సమాచారం. హైదరాబాద్, చెన్నైలో కూడా ఆమెకు సొంత ఫ్లాట్స్ ఇల్లులు కొనుగోలు చేసిందట. కాగా తెలుగులో మళ్ళీ రీ ఎంట్రీ ఇవ్వబోతున్నట్టు సమాచారం.

Advertisement
WhatsApp Group Join Now

govind

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది