F3 Movie : అసలు మిస్సైంది ఇదేగా.. అందుకే ఫ్లాప్ అంటున్నారే..అంతేగా అంతేగా.!
F3 Movie : దర్శకుడు అనిల్ రావిపూడి సినిమా అంటే గతంలో జంధ్యాల సినిమా చూసినట్టుంటుందని ఇండస్ట్రీలో అందరూ అభిప్రాయపడుతుంటారు. అనిల్ రావిపూడి కూడా ఆయన మార్క్ కామెడీని ఇష్టపడతానని అందుకే నా సినిమాలలో వల్గారిటీ లేకుండా అభిమానులను మెప్పించడానికి ట్రై చేస్తున్నాని చెప్పుకొచ్చిన సందర్భాలు చాలా ఉన్నాయి. నిజంగానే అనిల్ రావిపూడి మొదటి సినిమా పటాస్ నుంచి తాజాగా ప్రేక్షకుల ముందుకువచ్చిన ఎఫ్ 3 వరకు ఏ సినిమాలోనూ వల్గారిటీ కనిపించదు. హెల్తీ కామెడీ కనిపిస్తుంది. జనాలు కావాలనుకునేది కూడా ఇలాంటి సినిమాలే.అందుకే, అనిల్ రావిపూడి సినిమాలకు రిపీటెడ్ ఆడియెన్స్ ఎక్కువశాతం ఉంటారు.
అయితే, ఇప్పటివరకు ఆయన ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చిన సినిమాలలో కామెడీ మాత్రమే కాదు మంచి కథ, ఎమోషన్స్ కూడా ఉన్నాయి. కానీ, తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఎఫ్ 3 సినిమాలో మాత్రం కామెడీ తప్ప కథ లేదని జనాలు తేల్చేశారు. ఏదో అనుకొని వెళితే, అసలు సీక్వెల్ కథ మాదిరిగానే అనిపించలేదని ఎఫ్ 2 లో ఉన్న పాత్రలు సీక్వెల్‌లో కూడా కంటిన్యూ అయ్యాయి తప్ప మళ్ళీ పాత్రలను కొత్తగా పరిచయం చేసి జనాలను కన్‌ఫ్యూజ్ చేడాని చెప్పుకుంటున్నారు.ఏదో చిన్న పాయింట్ పట్టుకొని కామెడీ సీన్స్ అల్లేసి సినిమా చేశారు తప్ప బలమైన ఎమోషన్స్ లేవనే టాక్ వినిపిస్తోంది.
F3 Movie : ఎఫ్ 3 ఫలితంతో ఎఫ్ 4 ఉంటుందా లేదా..?
ఈ సినిమాలో వెంకీ – వరుణ్ తేజ్ పాత్రలు మినహా చూసి ఎంజాయ్ చేసేందుకు గానీ, గొప్పగా చెప్పుకునేందుకు గానీ ఏమీ లేదని సోషల్ మీడియాలో అభిప్రాయాలు వెల్లడవుతున్నాయి. ఒకరు రేచీకటి, ఒకరు నత్తితో సినిమాను నెట్టుకొచ్చారు గానీ, అనిల్ రావిపూడి ఈ సినిమాలో కథ లేకుండా చేయడం పెద్ద మైనస్ అంటున్నారు. ఇలాంటి సినిమాకు ఎంత ప్రమోషన్స్ చేసినా ఏం లాభమనే మాట వినిపిస్తోంది. ఇక ఎఫ్ 3 సినిమాకు సీక్వెల్ కూడా ఉంటుందని ఎఫ్ 4గా రాబోతున్న దీనిలో ఈసారి మరో హీరో కూడా ఉంటాడని చెప్పుకొచ్చాడు. మరి ఇప్పుడు ఎఫ్ 3 ఫలితంతో ఎఫ్ 4 ఉంటుందా లేదా అనేది మరికొన్ని రోజులు ఆగితేగాని తెలియదు.