Ram charan : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ Ram charan సినిమాల పరంగా అన్ని విషయాల్లో తండ్రికి తగ్గ తనయుడు అనిపించేసుకున్నారు. ఈ విషయాన్ని స్వయంగా చిరంజీవి సైతం చెబుతూ ఎప్పుడో చరణ్ నన్ను దాటేసాడని కూడా కొన్ని ఇంటర్వ్యూలలో చెప్పడం జరిగింది. ఇక ఇటీవల “RRR” సూపర్ డూపర్ హిట్ కావటం.. తోపాటు ఆస్కార్ వెళ్లడంతో చరణ్ పేరు ప్రపంచవ్యాప్తంగా మారుమోగింది. రామరాజు పాత్రలో చరణ్ నటన చాలామందిని ఆకట్టుకుంది. ఇదిలా ఉంటే ఒకపక్క పాపులారిటీ పెరుగుతున్న గాని మరోపక్క అభిమానుల విషయంలో చిరంజీవి మాదిరిగానే చరణ్ బాండింగ్ ఏర్పరచుకుంటూ వారితో కలుస్తూ వస్తున్నారు.
మొన్నటిదాకా విదేశాలలో ఉన్న చరణ్ ఇప్పుడు హైదరాబాదులోనే ఉండటం జరిగింది. ఈ సందర్భంగా అభిమానులతో కాసేపు ముచ్చటించడం జరిగింది. చరణ్ తో చాలా మంది అభిమానులు ఫోటోలు దిగటం మాత్రమే కాదు కొంతసేపు సంభాషించారు. ఈ క్రమంలో కొంతమంది చరణ్ పచ్చబొట్టు ఫోటోలను.. శరీరంపై వేసుకున్న వాటిని చూపించడం జరిగింది. అయితే ఈ అభిమానులతో భేటీ అయిన సమయంలో ఓ చిన్న కుర్రోడు అది కూడా టీనేజ్ వయసు ఉన్న కుర్రోడు బోరున ఏడ్చి చరణ్ దగ్గర తన బాధను చెప్పుకోవడంతో…

వెంటనే చలించిపోయిన చరణ్ తన సిబ్బందిని పిలిపించి కుర్రోడికి కావలసిన అవసరతలు తీర్చడానికి అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. అంతేకాదు సదరు కుర్రోడుతో ప్రత్యేకంగా ఫోటో కూడా చరణ్ దిగటం విశేషం. తాజాగా అభిమానులతో చరణ్ భేటీ అయిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.