God Father Movie : గాడ్ ఫాదర్ రిలీజ్.. అదొక్కటీ జరగకూడదు దేవుడా .. భయపడుతున్న మెగా ఫ్యాన్స్
God Father Movie : ఖైదీ నెంబర్ 150 సినిమాతో రీ ఎంట్రీ గ్రాండ్‌గా ఇచ్చిన మెగాస్టార్.. అదే జోష్‌ను కొనసాగిస్తూ వరుస సినిమాలు చేస్తున్నారు. ప్రస్తుతం చిరంజీవి ఆశలన్ని ‘గాడ్‌ఫాదర్’ చిత్రంపైనే ఉన్నాయి. మోహన్ రాజా దర్శకత్వం వహించిన ఈ చిత్రం మలయాళంలో సూపర్ హిట్టయిన ‘లూసిఫర్’ చిత్రానికి రీమేక్‌గా తెరకెక్కింది. యాక్షన్ పొలిటికల్ థ్రిల్లర్ నేపథ్యంలో రూపొందించిన ఈ చిత్రం దసరా సందర్భంగా అక్టోబర్ 5న విడుదల కానుంది. చిత్రబృందం తీరక లేకుండా వరుసగా ప్రమోషన్‌లను జరుపుతూ సినిమాపై మంచి బజ్ క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఈ సినిమాలో సల్మాన్ ఖాన్, నయనతార, సత్యదేవ్, సునీల్, సముద్రఖని, పూరి జగన్నాద్ వంటి వారు ఇతర కీలకపాత్రలలో నటించారు. ఆచార్య దెబ్బతో ఈ సినిమా మీద డిస్ట్రిబ్యూటర్లలో అనేక అనుమానాలు నెలకొన్నాయి.
దానికి కారణం ఈ సినిమా తెలుగు వర్షన్ ఇప్పటికే అమెజాన్ లో అందుబాటులో ఉంది, అయితే గాడ్ ఫాదర్ సినిమాలో సల్మాన్ ఖాన్ నటించడంతో భారీగా అంచనాలు అయితే నెలకొన్నాయి. తాజాగా అందుతున్న సమాచారం మేరకు నైజాం ప్రాంతంలో ఈ సినిమా 22 కోట్ల రూపాయలకు అమ్ముడుపోయినట్టు తెలుస్తోంది. అయితే సినిమా విడుదలకి కొద్ది సమయం మాత్రమే ఉంది. ఓపెనింగ్స్ ఎలా వస్తాయో అని కంగారు పడుతున్నారు. బిజినెస్ బాగానే జరిగిన, టాక్ విషయంలో తేడా కొడితే అసలుకే మోసం వస్తుందని అంటున్నారు. సినిమాకి పాజిటివ్ టాక్ రావాలని, మంచి ఓపెనింగ్స్ రావాలని కొందరు అభిప్రాయపడుతున్నారు. ఒరిజినల్ వెర్షన్‌లో మోహన్‌లాల్ పాత్ర నిడివి 50 నిమిషాలు ఉండగా.. గాడ్‌ఫాదర్‌లో చిరు పాత్ర రెండు గంటలు ఉండనుందట.
God Father Movie : భయం భయం..
అంతేకాకుండా కథలో కూడా చాలా మార్పులు చేశామని, మలయాళంలో చూడని పది పాత్రలు ఇందులో వేరే రూపంలో ఉంటాయని దర్శకుడు చెప్పడంతో మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. సల్మాన్ ఖాన్ గెస్ట్ రోల్‌లో నటించిన ఈ చిత్రాన్ని కొణిదెల ప్రొడక్షన్స్, సూపర్ గుడ్ ఫిలింస్ సంయుక్తంగా నిర్మించాయి. నయనతార కీలకపాత్ర పోషించగా, టాలీవుడ్ యంగ్ హీరో సత్యదేవ్ ప్రతినాయకుడి పాత్ర పోషించాడు. థమన్ సంగీతం అందించాడు. ఈ మూవీ మొత్తం తెలుగు రాష్ట్రాల్లో 70 కోట్ల 50 లక్షల రూపాయలకు గాడ్ ఫాదర్ సినిమా హక్కులు అమ్ముడుపోయాయి. ఇక కర్ణాటకలో ఈ సినిమా ఆరు కోట్ల 50 లక్షలకు అమ్ముడుపోయినట్టు చెబుతున్నారు. హిందీ సహా మిగతా ప్రాంతంలో మరో ఆరు కోట్ల 50 లక్షల మేరకు హక్కులు అమ్ముడుపోయినట్టు తెలుస్తోంది.