Naga chaitanya : నాగచైతన్య స్పందించాడు.. సమంత స్పందన రావాలి
Naga chaitanya : నాగచైతన్య విడాకులు తీసుకున్నట్లు గా నాగచైతన్య మరియు సమంత లు ప్రకటించిన విషయం తెలిసిందే. విడాకుల ప్రకటన తర్వాత ఇద్దరు కూడా మీడియా ముందుకు వచ్చినా ఆ విషయమై మాట్లాడేందుకు ఆసక్తి చూపించలేదు. ఇప్పటికీ విడాకుల విషయమై ఇద్దరం కలిసి నిర్ణయం తీసుకొని విడిపోయి కనుక మళ్ళీ మాట్లాడేది ఏముంది అన్నట్లుగా వారు అభిప్రాయపడుతూ వచ్చారు. మీడియా వారు ఎంతగా ప్రయత్నించినా కూడా విడాకుల విషయంలో మాట్లాడేందుకు ఇద్దరిలో ఏ ఒక్కరు కూడా ఆసక్తి చూపించలేదు. మొత్తానికి విడిపోయిన తర్వాత ఇద్దరు కూడా బిజీ అయ్యారు. సమంతా సినిమాలు మరియు సోషల్ మీడియా తో చాలా బిజీ గా కనిపిస్తుంది. మరోవైపు నాగచైతన్య కూడా బంగార్రాజు సినిమాను పూర్తి చేసి ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు గాను సిద్ధం చేశాడు.
నాగచైతన్య బంగార్రాజు సినిమా ప్రమోషన్లో భాగంగా సమంత తో విడిపోవడం పై ఆఫ్ ది రికార్డు మాట్లాడటం జరిగింది. మీడియా వారు ఆఫ్ ది రికార్డ్ అడిగినా ప్రశ్న కు నాగచైతన్య మాట్లాడుతూ ఇద్దరం సంతోషంగా ఉండాలని ఈ నిర్ణయం తీసుకున్నాము కనుక దాని గురించి పెద్దగా మాట్లాడటానికి ఏమీ లేదు అన్నట్లుగా సమాధానం చెప్పాడు. ప్రస్తుతం ఇద్దరం సంతోషంగా ఉన్నాము అన్నాడు. నాగ చైతన్య నుంచి ఏదో ఒక సమాధానం అయితే వచ్చింది. ప్రస్తుతం ఆయన హ్యాపీగా ఉన్నట్లుగా చెప్పుకొచ్చాడు. నాగచైతన్య నుంచి వచ్చిన సమాధానం తర్వాత ఇప్పుడు అంతా సమంత వైపు చూస్తున్నాను.

Fans demand Naga chaitanya samantha divorce reaction
ఆమె నుండి రాబోతున్న సమాధానం ఏంటంటూ ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు కాకుండా ఇంకెప్పుడైనా కూడా విడాకుల విషయమై ఆమె స్పందించాల్సి ఉంది అంటూ మీడియా వర్గం వారు మరియు అభిమానులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఎంతో అన్యోన్యంగా ఉండే నాగచైతన్య సమంత ఎందుకు హఠాత్తుగా విడిపోవాల్సి వచ్చింది అంటూ అభిమానులు విస్తుపోతున్నారు. సమంత ఏమైనా సమాధానం చెప్తుందా అనేది చూడాలి. నాగచైతన్య హ్యాపీగా ఉండటం కోసం విడాకులు తీసుకున్నామని చెప్పాడు అదే విషయాన్ని సమంత కూడా రిపీట్ చేస్తుందా లేదంటే నాగచైతన్య పై ఏమైనా ఆరోపణలు చేస్తూ విడాకుల విషయమై మాట్లాడుతున్నారా అనేది కూడా ఆసక్తిగా మారింది. మొత్తానికి సమంత ఏదో ఒక విషయం విడాకుల గురించి మాట్లాడే వరకు మీడియాలో ఊహాగానాలు వినిపిస్తూనే ఉంటాయి కనుక సమంత ఏదో ఒక ప్రత్యేక సందర్భంలో విడాకుల గురించి మాట్లాడితే సరిపోతుంది అని అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.