
కొన్ని సినిమాలు మొదలు పెట్టిన ముహూర్తం ప్రభావమో లేక పరిస్థితుల ప్రభావమో గాని మొదలు పెట్టినప్పటి నుంచి ఏదో ఒక కారణంతో షూటింగ్ సజావుగా సాగదు. ఒకవైపు ఆ సినిమా మీద ప్రేక్షకుల అంచనాలు పెరిగిపోతుంటాయి. బడ్జెట్ వేస్ట్ అవుతుంటుంది. ఇక హీరో, హీరోయిన్ తో పాటు మిగతా ఆర్టిస్టుల డేట్స్ ప్రాబ్లం వస్తుంటుంది.. చెప్పాలంటే చాలా సమస్యలు వస్తుంటాయి. ప్రస్తుతం సుకుమార్ రూపొందిస్తున్న పుష్ప సినిమా పరిస్థితి కూడా ఇలాగే ఉందని అంటున్నారు.
మైత్రీ మూవీస్, ముత్యం శెట్టి మీడియా నిర్మాణంలో తెరకెక్కుతున్న పుష్ప భారీ బడ్జెట్ తో పాన్ ఇండియన్ సినిమాగా తెరకెక్కుతోంది. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రష్మిక మందన్న జంటగా నటిస్తున్నారు. కాగా ఈ సినిమా మొదలైనప్పటి నుంచి చిత్ర యూనిట్ కి సమస్యలు వస్తూనే ఉన్నాయి. లాక్ డౌన్ కి ముందు కేరళ లో ఫారెస్ట్ లో భారీ షెడ్యూల్ ప్లాన్ చేసిన దర్శక, నిర్మాతలు కరోనా కారణంగా షూటింగ్ జరపలేకపోయిన సంగతి తెలిసిందే. ఈ షెడ్యూల్ క్యాన్సిల్ అవడం వల్ల కొంత బడ్జెట్ కూడా వృధా అయిందన్న టాక్ వచ్చింది.
కాగా అన్ లాక్ తర్వాత ఎట్టకేలకి సుకుమార్ పుష్ప సినిమాని సెట్స్ మీదకి తీసుకు
వచ్చాడు. మారేడుపల్లి ఫారెస్ట్ లో మొదలు పెట్టి కొంత టాకీ పార్ట్ కంప్లీట్ చేశాడు. అయితే టీమ్ లో కొందరికి కోవిడ్ సోకడంతో తిరిగి హైదరాబాద్ కు వచ్చేశారని తెలిసిందే. దాంతో ఇప్పుడు సుకుమార్ ఒక నిర్ణయానికి వచ్చాడని తెలుస్తోంది. గతంలో రంగస్థల సినిమా షూటింగ్ చేసిన ముప్పై ఎకరాల ప్లేస్ లోనే ఫారెస్ట్ సెట్ ని నిర్మించి ఇక్కడే పుష్ప ఫారెస్ట్ ఎపిసోడ్ ని కంప్లీట్ చేయాలని డిసైడయ్యాడట.
ప్రస్తుతం రంగస్థలం సినిమాకి సెట్ వేసిన ఆర్ట్ డైరెక్టర్స్ ఈ సినిమా ఫారెస్ట్ సెట్ ని నిర్మిస్తున్నారట. త్వరలో పుష్ప సెట్స్ మీదకి వెళ్ళబోతోందని సమాచారం. వాస్తవంగా ఈ ప్లాన్ ముందే అనుకున్న సుకుమార్ ఎందుకనో డ్రాపయ్యాడు. కాగా చివరికి ముందు అనుకున్న ప్లాన్ నే ఇప్పుడు అప్లై చేస్తున్నాడు. ఇక ఈ సినిమాని సమ్మర్ లో రిలీజ్ చేసెందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.
Onion Black Streaks : ఏ కూర వండినా ఉల్లిగడ్డ అనేది కీలకం. ఉల్లిగడ్డ లేకుండా ఏ కూర వండలేం.…
Jaggery Vs Sugar : మనిషి నాలుకకు టేస్ట్ దొరికితే చాలు.. అది ఆరోగ్యానికి మంచిదా? చెడ్డదా? అనే ఆలోచనే…
Benefits of Eating Fish : చాలామందికి ఫిష్ అంటే పడదు. చికెన్, మటన్ అంటే లొట్టలేసుకుంటూ లాగించేస్తారు కానీ..…
Egg vs Paneer : ఎగ్ అంటే ఇష్టం లేని వాళ్లు ఉండరు. కానీ నాన్ వెజిటేరియన్లు మాత్రమే ఎగ్…
Snoring Health Issues : చాలామంది నిద్రపోయేటప్పుడు గురక పెడుతూ ఉంటారు. గురక పెట్టేవాళ్లకు వాళ్లు గురక పెడుతున్నట్టు తెలియదు.…
Ghee Coffee or Bullet Coffee : కాఫీ అంటే అందరికీ తెలుసు కానీ ఈ బుల్లెట్ కాఫీ ఏంటి…
Swallow Bubble Gum : టైమ్ పాస్ కోసం చాలామంది నోట్లో ఎప్పుడూ బబుల్ గమ్ ను నములుతూ ఉంటారు.…
Garlic Health Benefits : వెల్లుల్లి అనగానే చాలామందికి నచ్చదు. ఎందుకంటే అది చాలా ఘాటుగా ఉంటుంది. కూరల్లో వేసినా…
This website uses cookies.