shanmukh : షణ్ముఖ్, సిరి బంధంపై సీరియస్ అయిన జెస్సీ.. తమ మధ్య ఉన్న బంధమెంటో చెప్పిన షన్ను..!
shanmukh : బిగ్ బాస్ చివరి దశకు చేరింది. పద్నాలుగో వారం మానస్, సిరి, షణ్ను, కాజల్, సన్నీ.. ఐదుగురూ నామినేషన్‌లో ఉండగా… సిరి లేదా కాజల్ ఎలిమినేట్ అవుతుందని అంతా భావించారు. అయితే అందరూ ఊహించిన విధంగానే కాజల్ హౌజ్ నుంచి బయటకు వచ్చింది. బిగ్ బాస్ ఇంటి నుంచి నిష్క్రమించే ముందు తన స్నేహితులైన సన్నీ, మానస్ లను చూసి కాజల్ తెగ ఎమోషనల్ అయింది. అంతలా వీరి మధ్య స్నేహం ఏర్పడింది…హౌస్ లోకి వచ్చాక బాగా క్లోజ్ అయ్యారు. ఓ రోజు గొడవపడతారు. ఆ మరుసటి రోజే మళ్ళీ రోజు క్లోజ్ అయిపోతారు. అలగటాలు, హగ్గులు, కిస్సులు ఇచ్చుకుంటారు.
ఒక పక్క మేం ఫ్రెండ్స్ అని చెప్పుకుంటూనే.. అసభ్యంగా రొమాన్స్ చేస్తుంటారు. ఓ వైపు ఇంటి సభ్యులు, మరోవైపు బయటి ప్రేక్షకులు వీళ్ళ గురించి అర్ధం కాక తల పగలకొట్టుకుంటున్నారు.ఇదిలా ఉండగా నేడు జరగబోయే ఏపిసోడ్ లో మాజీ ఇంటి సభ్యులంతా వీడియో కాన్ఫరెన్స్ లో ఇంటి సభ్యులతో చిట్ చాట్ చేశారు. జెస్సీ, ప్రియాంక, నటరాజ్ మాస్టర్, అని మాస్టర్, ప్రియ హౌజ్ మెట్స్ ను ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరి చేశారు. ముఖ్యంగా జెస్సీ.. సిరి, షన్ను ల బంధం పై.. వారివురిని తన ప్రశ్నలతో నిలదీయటం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

fires shanmukh siri relationship in Bigg Boss 5 Telugu house
shanmukh : అసలు మీ మధ్య ఉన్న బంధం ఏంటి..!
మీ ఇద్దరి బంధంపై.. మీ వ్యవహారం పై బయట జనాలు ఏమనుకుంటున్నారో మీరెప్పుడైనా ఆలోచించారా అని జెస్సీ.. తన స్నేహతులైన షన్ను, సిరిలపై సీరియస్ అయ్యాడు. అందుకు తగ్గట్లుగానే వారిద్దరూ స్పందించారు. తమ మధ్య ఉన్నది కేవలం స్నేహ బంధమే అని స్పష్టం చేశారు.ఇదిలా ఉండగా ప్రస్తుతం హౌజ్ లో ఉన్న టాప్ 5 సభ్యుల్లో సన్నీ, షణ్ముఖ్ లకు ఓటింగ్ పోటా పోటీగా సాగుతుంది. మిగతా వారితో పోలిస్తే కేవలం ఈ ఇద్దరికీ ఓటింగ్ భారీ స్థాయిలో జరుగుతోంది. ఆ తర్వాతి స్థానంలో శ్రీ రామ చంద్ర, మానస్, సిరి ఉన్నారు. అయితే విన్నర్ ఎవరో తేలాలంటే మరో వారం రోజులు వేచి చూడాలి.