Fish Venkat : ధీన స్థితిలో ఫిష్ వెంకట్.. చలించిపోయి సాయం అందించిన నిర్మాతలు..!
Fish Venkat : టాలీవుడ్ లో వందకు పైగా సినిమాల్లో కామెడీ విలన్ గా నటించిన ఫిష్ వెంకట్ ప్రస్తుతం దీన స్థితిలో ఉన్నాడు. గత కొంత కాలంగా తీవ్ర అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్న ఆయన రెండు కిడ్నీలు చెడి పోవడంతో నిమ్స్ లో ఏడాదిన్నరగా చికిత్స పొందుతున్నాడు. రెగ్యులర్ గా డయాలసిస్ చేయించుకుంటున్న ఫిష్ వెంకట్ ఆరోగ్య పరిస్థితి మరింతగా దిగ జారింది. ఇటీవల ఆయన కాలుకి ఇన్ఫెక్షన్ అయింది. దాంతో కనీసం నడవలేని పరిస్థితిలో […]
ప్రధానాంశాలు:
Fish Venkat : ధీన స్థితిలో ఫిష్ వెంకట్.. చలించిపోయి సాయం అందించిన నిర్మాతలు..!
Fish Venkat : టాలీవుడ్ లో వందకు పైగా సినిమాల్లో కామెడీ విలన్ గా నటించిన ఫిష్ వెంకట్ ప్రస్తుతం దీన స్థితిలో ఉన్నాడు. గత కొంత కాలంగా తీవ్ర అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్న ఆయన రెండు కిడ్నీలు చెడి పోవడంతో నిమ్స్ లో ఏడాదిన్నరగా చికిత్స పొందుతున్నాడు. రెగ్యులర్ గా డయాలసిస్ చేయించుకుంటున్న ఫిష్ వెంకట్ ఆరోగ్య పరిస్థితి మరింతగా దిగ జారింది. ఇటీవల ఆయన కాలుకి ఇన్ఫెక్షన్ అయింది. దాంతో కనీసం నడవలేని పరిస్థితిలో ఉన్నాడు. మరో వైపు ఆర్థికంగా కూడా ఫిష్ వెంకట్ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నాడు.
Fish Venkat పెద్ద సాయం..
ఇటీవల ఒక ఇంటర్వ్యూలో ఫిష్ వెంకట్ తన బాధను తెలియజేశాడు. ఇన్నాళ్లు తన వద్ద ఉన్న డబ్బుతో చికిత్స తీసుకున్న ఫిష్ వెంకట్ ఇప్పుడు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. చికిత్స కోసం, ఇతర అవసరాల కోసం డబ్బు లేకుండా అయిందని పేర్కొన్నాడు. హైదరాబాద్ రామ్ నగర్ లో ఉంటున్న వెంకట్ దీన స్థితిని తెలుసుకుని ఇండస్ట్రీకి చెందిన కొందరు సాయం చేసేందుకు ముందుకు వచ్చారు. మీడియా వారు కూడా కొందరు ఆయన్ను కలిసి సాయంను అందిస్తున్నారు. అయితే ప్రస్తుతం హైదరాబాద్ లోని రామ్ నగర్ లోని తన ఇంట్లోనే దయనీయ జీవితం గడుపుతోంది ఫిష్ వెంకట్ ఫ్యామిలీ. ఇటీవల ప్రముఖ ఛానెల్ ఆయనను సంప్రదించగా అతని దీన స్థితి వెలుగులోకి వచ్చింది. ఈ ఇంటర్వ్యూ వేదికగానే తన కుటుంబాన్ని ఆదుకోవాలని వేడుకున్నాడు.
ఆయన పరిస్థితి చూసిన అభిమానులు, నెటిజన్లు ఎమోషనల్ అయ్యారు. సినీ ఫిష్ వెంకట్ ఫ్యామిలీని ఆదుకోవాలని కోరుతున్నారు. ఈ నేపథ్యంలో నటుడి దీన పరిస్థితి చూసి చలించిపోయిన ప్రముఖ నిర్మాత చదలవాడ శ్రీనివాసరావు లక్ష రూపాయల ఆర్థిక సాయం అందించారు. టీఎఫ్‌పీసీ ట్రెజరర్ నిర్మాత రామసత్యనారాయణ, సెక్రటరీ టి.ప్రసన్నకుమార్, దర్శకుడు కె.అజయ్ కుమార్, తెలుగు ఫిలిం ఫెడరేషన్ ప్రెసిడెంట్ అనిల్ లు చదలవాడ శ్రీనివాసరావు తరఫున ఫిష్ వెంకట్‌కు లక్ష రూపాయల చెక్కును అందజేశారు.ఆయన చేసిన ఈ సాయాన్ని జీవితంలో ఎన్నటికి మరిచిపోలేనన్నారు. ఆయనకు తనతో పాటు తన కుటుంబం ఎప్పటికీ రుణపడి ఉంటుందని తెలిపారు. ఆ భగవంతుడి ఆశీస్సులు ఆయన పైన ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నానని ఫిష్ వెంకట్ భావోద్వేగానికి లోనయ్యారు.