Fish Venkat : ఫిష్ వెంకట్‌కు అండగా తెలంగాణ ప్రభుత్వం..చికిత్స ఖర్చులు భరిస్తామన్న మంత్రి..!
ప్రధానాంశాలు:
Fish Venkat : ఫిష్ వెంకట్‌కు అండగా తెలంగాణ ప్రభుత్వం..చికిత్స ఖర్చులు భరిస్తామన్న మంత్రి..!
Fish Venkat : తెలుగు సినీ పరిశ్రమలో విలక్షణ నటుడిగా పేరు సంపాదించుకున్న ఫిష్ వెంకట్ ఆరోగ్యం ప్రస్తుతం ఆందోళనకరంగా ఉన్న విషయం తెలిసిందే. ఆయనకు మెరుగైన వైద్యం అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం ముందుకొచ్చింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ పరంగా హాస్పిటల్ ఖర్చులను పూర్తిగా భరించనున్నట్లు మంత్రి వాకిటి శ్రీహరి ప్రకటించారు.

Fish Venkat : ఫిష్ వెంకట్‌కు అండగా తెలంగాణ ప్రభుత్వం..చికిత్స ఖర్చులు భరిస్తామన్న మంత్రి..!
Fish Venkat మంచి నిర్ణయం..
ఫిష్ వెంకట్‌గారి ఆరోగ్య పరిస్థితిని ప్రభుత్వం గమనించింది. ఆయన సినీ పరిశ్రమలో చేసిన సేవను గుర్తించి, వైద్య ఖర్చులను ప్రభుత్వం భరించనుంది. ఆయనకు అవసరమైన అన్ని విధాల సహాయం అందించేందుకు మేము సిద్ధంగా ఉన్నాం” అని మంత్రి వాకిటి శ్రీహరి తెలిపారు. ఫిష్ వెంకట్ ప్రస్తుతం హైదరాబాద్‌లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కిడ్నీ సంబంధిత సమస్యలతో బాధపడుతున్న ఆయన త్వరగా కోలుకోవాలని పలువురు టాలీవుడ్ ప్రముఖులు, నటులు, దర్శకులు ఆకాంక్షిస్తున్నారు.
సోషల్ మీడియా వేదికగా కూడా అభిమానులు కోలుకోవాలంటూ కామెంట్స్ చేస్తున్నారు. అయితే తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న ఈ చర్యపై సినీ వర్గాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. ఆర్టిస్ట్‌లు ఇలాంటి సమయంలో ప్రభుత్వ మద్దతు ఉండటం ఎంతో ప్రోత్సాహకరంగా అభివర్ణిస్తున్నారు.