Allu Arjun : అల్లు అర్జున్ కి ఊహించని సపోర్ట్.. జరిగింది ఏదైనా అంతా మంచికే..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Allu Arjun : అల్లు అర్జున్ కి ఊహించని సపోర్ట్.. జరిగింది ఏదైనా అంతా మంచికే..!

 Authored By ramu | The Telugu News | Updated on :14 December 2024,6:11 pm

ప్రధానాంశాలు:

  •  Allu Arjun : అల్లు అర్జున్ కి ఊహించని సపోర్ట్.. జరిగింది ఏదైనా అంతా మంచికే..!

పుష్ప 2 తో పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ అందుకున్న అల్లు అర్జున్ ని 12 గంటల పాటు అరెస్ట్ చేసి శుక్రవారం చంచల్ గూడ జైలులో రిమాండ్ లో ఉంచారు. శుక్రవారం సాయంత్రం 6 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు అల్లు అర్జున్ రిమాండ్ లో ఉంచి ఆరున్నర ప్రాంతంలో జైలు నుంచి రిలీజ్ చేశారు. ఐతే అల్లు అర్జున్ ను నిన్న అరెస్ట్ చేసిన దగ్గర నుంచి అటు మెగా ఫ్యామిలీ అల్లు ఫ్యామిలీ ఏం జరుగుతుందో అర్ధం కాక కంగారు పడ్డారు. ఈ ఇష్యూ వల్ల మెగా ఫ్యాన్స్ కూడా అల్లు అర్జున్ కి సపోర్ట్ చేయడం విశేషం. సోషల్ మీడియాలో వు స్టాండ్ విత్ అల్లు అర్జున్ అనే హ్యాష్ ట్యాగ్ ని ట్రెండ్ చేశారు. అంతేకాదు వైసీపీ తరపున అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కూడా అల్లు అర్జున్ అరెస్ట్ గురించి ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. మరోపక్క అందరి హీరోల ఫ్యాన్స్ సినిమాల గురించి ఫైట్ ఎలా ఉన్నా కూడా అల్లు అర్జున్ కి జరిగింది అన్యాయం అని కామెంట్ చేశారు.

Allu Arjun అల్లు అర్జున్ కి ఊహించని సపోర్ట్ జరిగింది ఏదైనా అంతా మంచికే

Allu Arjun : అల్లు అర్జున్ కి ఊహించని సపోర్ట్.. జరిగింది ఏదైనా అంతా మంచికే..!

Allu Arjun మెగా అల్లు ఫ్యామిలీ మధ్య సత్సంబంధాలు..

ఇక కొన్నాళ్లుగా మెగా ఫ్యామిలీ, అల్లు ఫ్యామిలీ మధ్య సత్సంబంధాలు లేవన్న టాక్ ఉండగా దాన్ని బ్రేక్ చేస్తూ అల్లు అర్జున్ అరెస్ట్ అని తెలియగానే అతని ఇంటికి చిరంజీవి, నాగ బాబు వెళ్లారు. చిరంజీవి పోలీస్ స్టేషన్ దాకా వెళ్లాలని అనుకున్నా పోలీసులు వద్దని చెప్పడంతో ఆగిపోయాడు. మరోపక్క ఏపీలో మీటింగ్ ఉన్నా సరే అది ముగియగానే పవన్ కళ్యాణ్ కూడా హైదరాబాద్ వచ్చారు.

ఇలా అల్లు అర్జున్ అరెస్ట్ కి ఇండస్ట్రీ అంతా ఒక్కటై అరెస్ట్ ని ఖండించారు. ఐతే అగ్ర హీరోలు కొందరు ఎన్ టీ ఆర్, మహేష్, ప్రభాస్ లాంటి వారు సోషల్ మీడియా ద్వారా కాకుండా అల్లు అర్జున్ తో పర్సనల్ గా మాట్లాడినట్టు తెలుస్తుంది. ఏది ఏమైనా పార్టీలకు అతీతంగా ఇష్యూని చూసి అల్లు అర్జున్ కొందరి వాడు కాదు అందరి వాడు అనిపించేలా చేసింది

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది