Bigg Boss 6 Telugu : బాత్రూంలో ఆ పని చేయలేను.. బిగ్ బాస్ ఇంట్లో గలాట పెట్టిన గీతూ

Authored By aruna | The Telugu News | Published on: September 6, 2022, 10:30 am

Bigg Boss 6 Telugu : బిగ్ బాస్ షో ఆరో సీజన్ ఆదివారం గ్రాండ్‌గా ప్రారంభమైంది. ఇంట్లోకి 21 మంది కంటెస్టెంట్లు ఎంట్రీ ఇచ్చారు. అయితే ఇందులో చాలా మంది మొహాలు జనాలకు తెలుసు. కొంత మంది మొహాలు మాత్రం ఎక్కడా కూడా కనిపించడం లేదు. జబర్దస్త్, యూట్యూబ్‌లో ఫేమస్ అయిన ఫేస్‌లో బిగ్ బాస్ ఇంట్లోకి వస్తున్నాయి. జబర్దస్త్ నుంచి చంటి, ఫైమాలు ఈ సారి బిగ్ బాస్ ఇంట్లోకి వచ్చారు. గలాట గీతూ కూడా జబర్దస్త్ షోలో కనిపించింది. కొన్ని స్కిట్లు చేసింది. అందరినీ మెప్పించింది. తన చిత్తూరు యాసలో అందరినీ ఆకట్టుకుంది.

అంతకు ముందు బిగ్ బాస్ షోలకు రివ్యూలు చెబుతూ యూట్యూబ్‌లో ఫేమస్ అయింది. అయితే కొన్ని సార్లు గీతూ మాటలు, ఓవర్ యాక్షన్ కాస్త వెగటు తెప్పించేలా ఉంటుంది. ఇక ఇప్పుడు బిగ్ బాస్ ఇంట్లోనూ గలాట గీతూ అలానే ప్రవర్తిస్తోంది. అసలే నేటి ఉదయం నుంచి గీతూ మీద నెటిజన్లు మండిపడుతున్నారు. ట్విట్టర్‌లో గీతూ మీద ట్రోలింగ్ జరుగుతోంది. ఆమె మాటలు వినలేకపోతోన్నారట. మైక్‌ను మ్యూట్ చేయండిరా అంటూ బిగ్ బాస్ టీంను రిక్వెస్ట్‌ చేస్తున్నారు.

Galata Geetu Fires on Inaya sulthana in Bigg Boss Telugu 6

Galata Geetu Fires on Inaya sulthana in Bigg Boss Telugu 6

అయితే తాజాగా నేడు వదిలిన ప్రోమోలో గీతూ రెచ్చిపోయింది. బాత్రూం ఏరియాలో ఎవరిదో జుట్టు కనిపించిందట. ఈ జుట్టు ఎవరిది? ఇలా ఎలా పడేస్తారంటూ రెచ్చిపోయింది. ఆజుట్టు ఇనయ సుల్తానాది అని తెలిసి ఆమె దగ్గరకు వెళ్లి అడిగింది. అది నాదే అని ఎలా చెబుతావ్.. అక్కడ చాలా మంది ఉన్నారు కదా? అని ఇనయ అనేసింది. నెక్ట్స్ నుంచి డ్యూటీలు వేద్దామని ఇనయ అంటుంది. డ్యూటీలు కాదు.. బిగ్ బాస్ నాకు టాస్కులు ఇచ్చినా కూడా ఇలా బాత్రూంలో వేరే వాళ్ల జుట్టు ఉంటే నేను తీయను అంటూ చెబుతుంది.

aruna

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp